Bank locker rules: మీరు ఈ వస్తువులను బ్యాంక్ లాకర్‌లో ఉంచలేరు.. అసలు ఎలాంటి వస్తువులు పెట్టుకోవచ్చో తెలుసుకోండి..
బ్యాంక్ లాకర్‌లు వ్యక్తిగతంగా విలువైన వస్తువులు, డాక్యుమెంట్లు, ఆస్తి పత్రాలను భద్రంగా ఉంచడానికి ఉపయోగిస్తారు. వీటిని బ్యాంక్ నియమాల ప్రకారం నిర్దిష్ట సమయాల్లో యాక్సెస్ చేయవచ్చు. ప్రతి లాకర్‌కి ప్రత్యేక తాళం లేదా పిన్ కాంబినేషన్ ఉండడం వల్ల సెక్యూరిటీ మరింత మెరుగుపడుతుంది. బంగారం, నగదు, పత్రాలు వంటి విలువైన వస్తువులను భద్రంగా ఉంచడానికి ఇది అనువైన మార్గం. లాకర్‌లో ఉంచకూడని వస్తువులు: ఆయుధాలు (Weapons), పేలుడు పదార్థాలు (Explosives), మాదక ద్రవ్యాలు (Drugs), త్వరగా పాడయ్యే ఆహార పదార్థాలు, రేడియోధార్మిక పదార్థాలు (Radioactive materials), నిషేధిత వస్తువులు. కొన్ని బ్యాంకులు నగదు ఉంచేందుకు అనుమతించవు, ఎందుకంటే నగదు సాధారణంగా సురక్షితంగా ఉండదు,అంతేకాకుండా దానికి ఇన్సూరెన్స్ ఉండదు.
లాకర్‌లో ఉంచగలిగే వస్తువులు
బంగారం, వెండి, వజ్రాలు వంటి విలువైన ఆభరణాలు ఆస్తి పత్రాలు, పవర్ ఆఫ్ అటార్నీ, లీగల్ డాక్యుమెంట్స్ మ్యూచువల్ ఫండ్ బాండ్లు, షేర్ సర్టిఫికెట్స్, ఇన్సూరెన్స్ పాలసీలు విలువైన నాణేలు, గోల్డ్, సిల్వర్ బార్స్ బ్యాంక్ లాకర్ ఒప్పందం (Locker Agreement): బ్యాంకు లాకర్లలో నిషేధిత వస్తువులు ఉంచడానికి అనుమతి లేదు. బ్యాంకు కస్టమర్లకు లాకర్‌లో దాచుకున్న వస్తువుల వివరాలను తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే, లాకర్‌లో ఏమి ఉంచారో బాధ్యత పూర్తి స్థాయిలో కస్టమర్‌దే.
వస్తువులు పోతే ఏమవుతుంది?
లాకర్‌లోని వస్తువులు గనక అగ్నిప్రమాదం, దొంగతనం, లేదా బ్యాంకు ఉద్యోగుల మోసపూరిత కార్యకలాపాల వల్ల పోతే, బ్యాంకు కేవలం మీరు చెల్లించిన సంవత్సరపు అద్దె 100 రెట్లు పరిహారంగా చెల్లిస్తుంది. లాకర్‌లో ఉన్న ఇతర వస్తువులపై బ్యాంకు ఎటువంటి బాధ్యత వహించదు.