Stock Market: లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 23,800 మార్క్ పైన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, ఆటో, ఫైనాన్షియల్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు పొందడంతో సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మార్కెట్ ప్రారంభం సమయంలోనే సెన్సెక్స్ 200 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది, నిఫ్టీ 23,800 మార్క్‌ను అందుకుంది. ఉదయం 9:30 గంటలకు సెన్సెక్స్ 315 పాయింట్ల లాభంతో 78,788 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 101 పాయింట్ల లాభంతో 23,829 వద్ద కొనసాగుతోంది.
బంగారం ఔన్సు ధర 2,643.40 డాలర్లు
సెన్సెక్స్ 30 సూచీలో ఎస్‌బీఐ,మారుతీ సుజుకీ,ఐసీఐసీఐ బ్యాంక్,యాక్సిస్ బ్యాంక్,కోటక్ మహీంద్రా బ్యాంక్,అదానీ పోర్ట్స్,హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్,ఎంఅండ్‌ఎం,ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇక, ఏషియన్ పెయింట్స్,టెక్ మహీంద్రా షేర్లు మాత్రం నష్టాలతో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 73.90 డాలర్ల వద్ద ఉంది.బంగారం ఔన్సు ధర 2,643.40 డాలర్ల వద్ద ట్రేడవుతుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 85.24వద్ద కొనసాగుతోంది.గత ట్రేడింగ్ సెషన్‌లో అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఆసియా-పసిఫిక్ మార్కెట్ల ప్రధాన సూచీలు కూడా నేడు లాభాల్లో కొనసాగుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) మంగళవారం రూ.2454 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు, అయితే దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.2819 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.