LOADING...
Bharat Coking Coal IPO: భారత్ కోకింగ్ కోల్ IPOకి అదిరిపోయిన స్పందన.. నిమిషాల్లోనే సబ్‌స్క్రిప్షన్‌ పూర్తి! 
నిమిషాల్లోనే సబ్‌స్క్రిప్షన్‌ పూర్తి!

Bharat Coking Coal IPO: భారత్ కోకింగ్ కోల్ IPOకి అదిరిపోయిన స్పందన.. నిమిషాల్లోనే సబ్‌స్క్రిప్షన్‌ పూర్తి! 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 09, 2026
02:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభుత్వ రంగ దిగ్గజం కోల్ ఇండియా అనుబంధ సంస్థ భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ (IPO)కి ఊహించినదానికంటే ఎక్కువ స్పందన వచ్చింది. శుక్రవారం సబ్‌స్క్రిప్షన్ ప్రారంభమైన కొన్ని నిమిషాలకే పూర్తి సబ్‌స్క్రిప్షన్ మంజూరు అయ్యింది. ఎన్‌ఎస్‌ఈ డేటా ప్రకారం, మధ్యాహ్నం 11.15 గంటల వరకు 34,69,46,500 షేర్ల కోసం 84,15,46,800 బిడ్లు దాఖలయ్యాయి.అంటే సుమారుగా 2.43 రెట్లు సబ్‌స్క్రిప్షన్ నమోదుైంది. కేటగిరీ వారీగా సబ్‌స్క్రిప్షన్ వివరాలు ఇలా ఉన్నాయి: నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు:3.79 రెట్లు సబ్‌స్క్రిప్షన్ రిటైల్ ఇన్వెస్టర్లు:3.35 రెట్లు సబ్‌స్క్రైబ్ క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్: 1 శాతం సబ్‌స్క్రిప్షన్ అలాగే,యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 273 కోట్లు సమీకరించారని భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ గురువారం వెల్లడించింది.

వివరాలు 

ఆఫర్ ఫర్ సేల్ రూపంలో పబ్లిక్ ఇష్యూ 

మొత్తం పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 1,071 కోట్లు సమీకరించనుందని కంపెనీ ప్రకటించింది. సబ్‌స్క్రిప్షన్ జనవరి 13న ముగుస్తుంది. కంపెనీ నిర్ణయించిన షేర్ ధరల శ్రేణి రూ. 21-23. భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ 1972లో స్థాపితమైంది. జార్ఖండ్‌లోని జారియా, పశ్చిమ బంగాళాలోని రాణిగంజ్ కోల్ మైన్స్ నుంచి కోకింగ్ కోల్ సరఫరా చేస్తుంది. కోల్ ఇండియా వాల్యూ అన్‌లాక్ ప్రాజెక్ట్‌ కింద, అనుబంధ సంస్థ షేర్లను ప్రభుత్వ విక్రయం ద్వారా ప్రజలకు అందిస్తోంది. ఈ పబ్లిక్ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) రూపంలో ఉంది. కోల్ ఇండియా 46.57 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయిస్తోంది. కంపెనీ షేర్లు జనవరి 16న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్ కానున్నాయి.

Advertisement