Ola: 1,000 మంది ఉద్యోగాలను తొలగించనున్న ఓలా..
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric)మరోసారి ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతోంది.
సంస్థలో ప్రస్తుతానికి పనిచేస్తున్న సుమారు 1,000మంది ఉద్యోగులు,కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే యోచనలో ఉందని సమాచారం.
ఆర్థిక నష్టాలను తగ్గించేందుకు ఈనిర్ణయం తీసుకున్నట్టు బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించింది.
కంపెనీ ఖర్చులను తగ్గిస్తూ,నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచేందుకు ఓలా చర్యలు తీసుకుంటోందని మీడియా కథనాలు సూచిస్తున్నాయి.
ప్రొక్యూర్‌మెంట్,కస్టమర్ రిలేషన్స్,ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి విభాగాల్లో ఈతొలగింపులు జరిగే అవకాశముందని తెలుస్తోంది.
ఈవార్తలు వెలువడిన వెంటనే ఓలా ఎలక్ట్రిక్ షేర్లు 5%తగ్గాయని సమాచారం.కేవలం ఐదునెలల్లోనే ఇది రెండోసారి ఉద్యోగాల కోతగా మారింది.
గతేడాది నవంబర్‌లో సుమారు 500మంది ఉద్యోగులను తొలగించిన ఓలా,ఇప్పుడు మరింత ఎక్కువ మంది ఉద్యోగులపై వేటు వేయాలని నిర్ణయించుకుంది.
వివరాలు
ఓలా ఎలక్ట్రిక్ వివాదాలకు కేంద్రబిందువు
ఇటీవల కొన్ని రోజులుగా ఓలా ఎలక్ట్రిక్ వివాదాలకు కేంద్రబిందువుగా మారిన సంగతి తెలిసిందే.
సంస్థ అందించే సేవలపై వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి.
వినియోగదారుల హక్కుల ఉల్లంఘన, తప్పుదోవ పట్టించే ప్రకటనలు,అన్యాయమైన వ్యాపార విధానాలపై ఆరోపణలు ఎదుర్కొంటోంది.
దీంతో సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) ఓలా ఎలక్ట్రిక్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
అంతేకాక, సోషల్ మీడియా వేదిక ఎక్స్ (Twitter) లో ప్రముఖ కమెడియన్ కునాల్ కమ్రా, ఓలా వ్యవస్థాపకుడు భవీశ్ అగర్వాల్ మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.
ఈ పరిణామాల నేపథ్యంలో కంపెనీ వ్యయ నియంత్రణ చర్యలలో భాగంగా ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.