
UPI New Rules : ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే వినియోగదారులకు బిగ్ అలర్ట్..యూపీఐలో కొత్త నిబంధనలు!
ఈ వార్తాకథనం ఏంటి
యూపీఐ చెల్లింపులు చేసే వారికి ముఖ్యమైన మార్పులు అమల్లోకి వచ్చాయి. సెప్టెంబర్ 15 నుంచి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. దీంతో డిజిటల్ చెల్లింపులు మరింత వేగవంతంగా, సౌకర్యవంతంగా మారనున్నాయి. చిరు వ్యాపారుల నుంచి సాధారణ వినియోగదారుల వరకు ఉపయోగపడేలా ఈ మార్గదర్శకాలను రూపొందించారు. పెద్ద లావాదేవీలు సులభతరం చేయడమే దీని ప్రధాన లక్ష్యం. అయితే వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే యూపీఐ ట్రాన్స్ఫర్‌లపై రోజువారీ పరిమితి మాత్రం యథాతథంగా లక్ష రూపాయలుగానే కొనసాగనుంది.
Details
ఎన్పీసీఐ కొత్త మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి
స్టాక్ మార్కెట్, ఇన్సూరెన్స్ ప్రీమియం, ఈవీఎం, క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులు - ఒక్క ట్రాన్సాక్షన్‌లో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పేమెంట్ చేయొచ్చు. ట్రావెల్, హోటల్, ఫ్లైట్ టికెట్లు - ఒక ట్రాన్సాక్షన్‌లో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు చెల్లించవచ్చు. ప్రభుత్వం ఈ-మార్కెట్‌ప్లేస్ (GeM) - రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పేమెంట్ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డు బిల్లులు - ఒకేసారి రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు చెల్లించుకోవచ్చు. ఆభరణాల కొనుగోలు - రూ.2 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు పేమెంట్ చేసుకోవచ్చు.
Details
కొత్త రూల్స్ ఇవే
బిజినెస్/మర్చంట్ పేమెంట్స్ - ఒక్క ట్రాన్సాక్షన్‌కు రూ.5 లక్షల వరకు పేమెంట్ చేయొచ్చు. ఈ విభాగానికి రోజువారీ పరిమితి లేదు. ఎఫ్‌ఎక్స్ రిటైల్ లావాదేవీలు - గరిష్టంగా రూ.5 లక్షల వరకు మాత్రమే. టర్మ్ డిపాజిట్ల కోసం డిజిటల్ అకౌంట్ ఓపెనింగ్ - రూ.5 లక్షల వరకు. డిజిటల్ అకౌంట్ ఓపెన్ - ప్రారంభ ఫండింగ్ - రోజుకు రూ.2 లక్షల వరకు మాత్రమే. డిజిటల్ చెల్లింపుల వినియోగం విస్తృతమవుతున్న నేపథ్యంలోనే ఈ కొత్త రూల్స్‌ను అమలు చేస్తున్నట్టు ఎన్పీసీఐ వెల్లడించింది. ఈ మార్పులు డిజిటల్ ఇండియాకు మరింత బలం చేకూరుస్తాయని, వినియోగదారులకు పెద్ద సౌలభ్యాన్ని అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు.