LOADING...
Gold Price : బంగారం ధరల్లో పెద్ద మార్పు.. వారం రోజుల్లో తులానికి రూ.3,500 పెరుగుదల!
బంగారం ధరల్లో పెద్ద మార్పు.. వారం రోజుల్లో తులానికి రూ.3,500 పెరుగుదల!

Gold Price : బంగారం ధరల్లో పెద్ద మార్పు.. వారం రోజుల్లో తులానికి రూ.3,500 పెరుగుదల!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 31, 2025
10:43 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బ్యాడ్ న్యూస్ అందింది. గోల్డ్‌ రేట్లు వేగంగా పెరుగుతూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. గత వారం రోజులలో బంగారం ధరలు భారీ ఎత్తున పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ భారతదేశం నుంచి దిగుమతి అవుతున్న ఉత్పత్తులపై భారీ సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం బంగారం ధరలపై కూడా ప్రభావం చూపింది. ఆగస్టు 26 నుంచి ఆగస్టు 31 వరకు గోల్డ్ రేటు గణనీయమైన పెరుగుదలను నమోదు చేసింది. కేవలం వారం రోజుల్లోనే 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.3,500 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్‌ రేట్లు దూసుకెళ్తున్నాయి.

Details

ఇంకా పెరిగే ఛాన్స్

ఆదివారం ఉదయం ఒక్క ఔన్స్‌ బంగారం ధర 33 డాలర్ల వరకు పెరిగి 3,447 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ట్రంప్‌ సుంకాల ప్రభావంతో పాటు గ్లోబల్‌ స్థాయిలో జరుగుతున్న ఆర్థిక పరిణామాలు కూడా బంగారం ధరను మరింతగా ఎగబాకేలా చేస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Details

 తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు

హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో బంగారం ధరలో ఎటువంటి మార్పులు చోటుచేసుకోలేదు. ఈ నగరాల్లో 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.96,200గా, 24 క్యారట్ల బంగారం ధర రూ.1,04,950గా కొనసాగుతోంది. దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.96,350 కాగా, 24 క్యారట్ల ధర రూ.1,05,100కి చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.96,200గా, 24 క్యారట్ల ధర రూ.1,04,950గా ఉంది.

Details

వెండి ధర 

హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.1,31,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరులో కిలో వెండి ధర రూ.1,21,000గా ఉంది. * చెన్నైలో కిలో వెండి ధర రూ.1,31,000 వద్ద కొనసాగుతోంది.