
ఎలన్ మస్క్‌కు బిగ్ షాక్.. ట్విట్టర్ పై 250 మిలియన్ డాలర్ల దావా
ఈ వార్తాకథనం ఏంటి
నేషనల్ మ్యూజిక్ పబ్లిషర్స్ అసోసియేషన్ దాదాపు 1700 కాపీరైట్లను ఉల్లంఘించినందుకు ఎలన్ మస్క్ యాజమాన్యంలోని ట్విట్టర్ పై 250 మిలియన్ డాలర్ల దావా వేసింది.
ముఖ్యంగా ఆ సంఘంలోని సోనీ మ్యూజిక్, పబ్లిషింగ్, బీఎంజీ రైట్స్ మేనేజ్ మెంట్, యూనివర్సల్ మ్యూజిక్ పబ్లిషింగ్, వార్నర్ చాపెల్ వంటి ప్రధాన సంగీత ప్రచురణ కర్తలు ఉండడం విశేషం.
17మంది మ్యూజిక్ పబ్లిషర్స్ తరుపున టేనస్సీ రాష్ట్రంలోని ఫెడరల్ కోర్టులో దాఖలైన దావా ట్విట్టర్ సంబంధించి కాపీరైట్ ఉల్లంఘనకు నష్టపరిహారం, తాత్కలిక ఉపశమనం కలిగేలా చర్యలు తీసుకోవాలని కోరింది.
ముఖ్యంగా ట్విట్టర్ సంగీత కూర్పుల కాపీలతో ట్విట్టర్ తన వ్యాపారంలో భాగం చేసుకుందని దావాలో పేర్కొంది
Details
నోటిఫై చేసిన తర్వాత కంటెంట్ ను తొలగించడంలో ట్విట్టర్ విఫలం
ఈ వాజ్యంలో సుమారు 1700 పాటలు ఉండడం విశేషం. వీటిని ట్విట్టర్ కు బహుళ కాపీరైట్ నోటీసులలో చేర్చారు. ప్రతి ఉల్లంఘటనకు మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్ ఫాం $150,000 వరకు జరిమానా విధించాలని కోర్టును కోరింది.
ట్విట్టర్ ప్లాట్ ఫారం మల్టీమీడియా కంటెంట్ కు హాట్ డెస్టినేషన్ గా మారిందని, సంగీతంలో వీడియోలు ప్రత్యేకమైనవి, ముఖ్యమైనవిగా ఉన్నాయని దావాలో పేర్కొంది.
నోటిఫై చేసిన తర్వాత ఉల్లంఘన కంటెంట్ ను తొలగించడంలో ట్విట్టర్ విఫలమైందన్నారు. అయితే దీనిపై అధికారికంగా ఇంకా ట్విట్టర్ స్పందించకపోవడం విశేషం.