Page Loader
 Bitcoin: ఆల్​-టైమ్​ హైని తాకిన బిట్​కాయిన్​.. మొదటిసారిగా 1,21,000 డాలర్ల మార్క్​ని చేరిన బిట్‌ కాయిన్‌ విలువ..!
ఒక కోటి నాలుగు లక్షల రుపాయలకు చేరిన బిట్‌ కాయిన్‌ విలువ..!

 Bitcoin: ఆల్​-టైమ్​ హైని తాకిన బిట్​కాయిన్​.. మొదటిసారిగా 1,21,000 డాలర్ల మార్క్​ని చేరిన బిట్‌ కాయిన్‌ విలువ..!

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 14, 2025
11:40 am

ఈ వార్తాకథనం ఏంటి

పర్సనల్ ఫైనాన్సింగ్ విభాగంలో బిట్‌ కాయిన్ ఇప్పుడు కొత్త పెట్టుబడి ఎంపికగా మారిందని చెప్పవచ్చు. దీని ఫలితంగా, ఈ క్రిప్టో కరెన్సీ విలువ తన దీర్ఘకాల ప్రయాణంలో 1 లక్ష 20 వేల డాలర్ల జీవితకాల గరిష్ఠానికి చేరుకుంది. ఈ మార్పుకు ప్రధాన కారణంగా ఇన్వెస్టర్లలో పెరిగిన అవగాహనతో పాటు, వారు క్రిప్టో పెట్టుబడుల వైపు అడుగులు వేయడం అని ప్రముఖ క్రిప్టో ఎక్స్ఛేంజీ అయిన జియోటస్ సంస్థ వివరించింది. ఒకప్పుడు కేవలం ఇంట్రాడే ట్రేడింగ్‌ కోసమే క్రిప్టో మార్కెట్లోకి ప్రవేశించిన ఇన్వెస్టర్లు ఇప్పుడు దీన్ని వ్యూహాత్మకమైన దీర్ఘకాలిక అసెట్ క్లాస్‌గా చూస్తున్నారని, వాటి వాలెట్ జాయినింగ్‌ లలో కనిపిస్తున్న పెరుగుదల దీనికి నిదర్శనంగా పేర్కొంది.

వివరాలు 

2025లో కూడా బలమైన ట్రెండ్ కొనసాగే అవకాశం 

ప్రస్తుతం మార్కెట్లో జరుగుతున్న ఈ మార్పులు బిట్‌కాయిన్‌ను వేగంగా సంపద సృష్టించగల ఆధారమైన పెట్టుబడి సాధనంగా చూపిస్తున్నాయని, దీనిపై గల నమ్మకం బలపడుతోందని జియోటస్ సంస్థ అభిప్రాయపడింది. ఇటీవల బిట్‌కాయిన్ తన టెక్నికల్ రెసిస్టెన్స్ లెవెల్ అయిన 1 లక్ష 10 వేల డాలర్ల మార్క్‌ను దాటి ర్యాలీ కొనసాగించటం,దీనికి ప్రధాన కారకంగా మారింది. దీనితో పాటు ఎథెరియం, సోలానా, కార్డానో, సుయి వంటి ఇతర క్రిప్టో కాయిన్స్ కూడా పెట్టుబడిదారుల నుంచి మంచి ఆదరణ పొందుతున్నాయని సంస్థ వెల్లడించింది. డేటా ప్రకారం 2025లో కూడా బలమైన ట్రెండ్ కొనసాగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. మధ్యలో కొన్ని చిన్న చిన్న ఒడిదొడుకులు ఉన్నప్పటికీ, క్రిప్టో పెట్టుబడులకు మార్కెట్లో స్థిరమైన స్థానముందని జియోటస్ విశ్వసిస్తోంది.

వివరాలు 

బిట్‌కాయిన్ ధర 1 లక్ష 50 వేల డాలర్ల వరకూ పెరిగే అవకాశం 

అయితే, బిట్‌కాయిన్ ధర ర్యాలీ ఇక ఎక్కడ వరకూ చేరుతుందనే అనుమానం చాలామందిలో నెలకొనగా, జియోటస్ సీఈవో విక్రమ్ సుబ్బురాజ్ ఇచ్చిన అంచనాల ప్రకారం బిట్‌కాయిన్ ధర 1 లక్ష 35 వేల డాలర్ల వద్ద కీలక నిరోధాన్ని ఎదుర్కొనబోతుందని తెలుస్తోంది. ఇలాంటి సందర్భంలో క్రిప్టో ఈటీఎఫ్ పెట్టుబడులు పెరిగితే, ఒక్కో బిట్‌కాయిన్ ధర 1 లక్ష 50 వేల డాలర్ల వరకూ పెరిగే అవకాశముందని విక్రమ్ అభిప్రాయపడుతున్నారు. మార్కెట్లో ఉన్న ఒడిదొడుకులు, లాభాల స్వీకరణ (ప్రాఫిట్ బుక్కింగ్) వంటి అంశాలు ఉన్నప్పటికీ, ఇప్పుడు తమ పెట్టుబడులలో కొంత భాగాన్ని క్రిప్టోకరెన్సీలకు కేటాయించేందుకు ఇది సరైన సమయమని జియోటస్ సీఈవో విక్రమ్ సుబ్బురాజ్ సూచిస్తున్నారు.