BPL: బీపీఎల్ స్థాపకుడు టీపీజీ నంబియార్ ఇకలేరు
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ బీపీఎల్ స్థాపకుడు టీపీజీ నంబియార్ (95) వృద్ధాప్య సమస్యల కారణంగా కన్నుమూశారు. గురువారం తెల్లవారుజామున బెంగళూరులోని ఆయన నివాసంలో మృతి చెందారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న నంబియార్ మరణం పట్ల కుటుంబ సభ్యులు శోకాన్ని వ్యక్తం చేశారు. ఃబీపీఎల్ గురించి ఆయన అల్లుడు, బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ సోషల్ మీడియాలో ప్రకటించారు. బీపీఎల్ భారత ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించింది.
బీపీఎల్ కు ప్రత్యేక గుర్తింపు
ఎన్ని కొత్త బ్రాండ్లు వచ్చినా, నేటికీ గృహోపకరణాల విభాగంలో బీపీఎల్‌కి విశేష ఆదరణ ఉంది. యూఎస్, యూకేలో విస్తృత అనుభవం కలిగిన నంబియార్, భారతీయ వినియోగదారులకు నమ్మకమైన ఉత్పత్తులు అందించాలనే లక్ష్యంతో 1963లో కేరళలోని పాలక్కాడ్‌లో ఈ కంపెనీని ప్రారంభించారు. కర్ణాటకలోని బెంగళూరును ప్రధాన కేంద్రంగా బీపీఎల్ సంస్థ భారతీయ గృహోపకరణాల్లో ఒక గుర్తింపు పొందిన బ్రాండ్‌గా నిలిచింది.