Evergrande: హాంకాంగ్‌లో ఎవర్‌గ్రాండ్ షేర్ల ట్రేడింగ్‌కు బ్రేక్
అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న చైనా స్థిరాస్తి దిగ్గజం ఎవర్‌గ్రాండ్ షేర్ల ట్రేడింగ్ కు బ్రేక్ పడింది. గురువారం హాకాంగ్ మార్కెట్లో ఎవర్‌గ్రాండ్ షేర్ల ట్రేడింగ్ ను నిలిపివేశారు. మరో రెండు అనుబంధ సంస్థల షేర్ల ట్రేడింగ్‌ను సైతం సస్పెండ్ చేసినట్లు హంకాంగ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ స్పష్టం చేసింది. భారీ ఎత్తున పేరుకుపోయిన రుణ బకాయిలను కంపెనీ పునర్ వ్యవస్థీకరించుకునే అవకాశాలు తగ్గిపోయాయంటూ విశ్లేషణలు వస్తున్న తరుణంలో ఈ కీలక పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. అయితే ఈ సస్పెన్షన్ కు కారణాన్ని మాత్రం అటు ఎవర్‌గ్రాండ్, ఇటు స్టాక్ ఎక్స్ఛేంజ్ వెల్లడించలేదు.
2021లో ఎగవేతకు పాల్పడిన ఎవర్ గ్రాండ్
ఇక జూన్ ముగిసే సరికి ఎవర్‌గ్రాండ్ కు 328 బిలియన్ డాలర్ల రుణ బకాయిలు ఉండడం విశేషం. అయా రుణదాలతో జరుపుతున్నా పునర్ వ్యవస్థీకరణ చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఇక విదేశీ రుణదాలతో జరుపుతున్న చర్చలు డోలాయమానంలో పడ్డాయని గత ఆదివారం కంపెనీ ప్రకటించింది. ముఖ్యంగా చైనాలో కంపెనీకి చెందిన ఓ ప్రధాన అనుబంధ సంస్థపై ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో ఎవర్‌గ్రాండ్ నష్టాలు తగ్గాయని ఇటీవలే కంపెనీ వెల్లడించింది. రుణపునర్ వ్యవస్థీకరణ, ప్రభుత్వ దర్యాప్తులు వంటి పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల నుంచి ఒత్తిడి ఎక్కువైంది. రెండో అతిపెద్ద స్థిరాస్తి అయిన ఎవర్‌గ్రాండ్ 2021లో తొలిసారి ఎగవేతకు పాల్పడిన విషయం తెలిసిందే.