LOADING...
Groww stocks: ఆర్‌బీఐ కొత్త నిబంధనలతో స్టాక్ బ్రోకింగ్ కంపెనీల షేర్లకు భారీ దెబ్బ
ఆర్‌బీఐ కొత్త నిబంధనలతో స్టాక్ బ్రోకింగ్ కంపెనీల షేర్లకు భారీ దెబ్బ

Groww stocks: ఆర్‌బీఐ కొత్త నిబంధనలతో స్టాక్ బ్రోకింగ్ కంపెనీల షేర్లకు భారీ దెబ్బ

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 16, 2026
11:34 am

ఈ వార్తాకథనం ఏంటి

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌ బి ఐ) తాజాగా ప్రకటించిన కఠినమైన రుణ నిబంధనల ప్రభావంతో సోమవారం స్టాక్ మార్కెట్ మధ్యవర్తి సంస్థల షేర్లు తీవ్రంగా పతనమయ్యాయి. బీఎస్‌ఈ, ఏంజెల్ వన్, గ్రోవ్ వంటి ప్రముఖ కంపెనీల షేర్లు ఒకే రోజులో 10 శాతం వరకు పడిపోయాయి. ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చే ఈ కొత్త నిబంధనల ప్రకారం, క్యాపిటల్ మార్కెట్ మధ్యవర్తులకు బ్యాంకులు పూర్తిగా భద్రత కలిగిన రుణాలనే ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటివరకు కొంత మేర అన్‌సెక్యూర్డ్ హామీలతో రుణాలు ఇచ్చే వెసులుబాటు ఉండగా, ఇప్పుడు ఆ విధానానికి పూర్తిగా గుడ్‌బై చెప్పాల్సి వస్తోంది.

వివరాలు 

ప్రొప్రైటరీ ట్రేడర్లపై ఎక్కువ భారం

మార్జిన్ ట్రేడింగ్ సౌకర్యాల విషయంలో ఆర్‌బీఐ నిబంధనలు మరింత కఠినంగా ఉన్నాయి. మొత్తం అవసరమైన 100 శాతం కాలేటరల్‌లో కనీసం 50 శాతం నగదు రూపంలోనే ఉండాలని ఆదేశించింది. అంతేకాదు, కాలేటరల్‌గా తీసుకునే ఈక్విటీ షేర్లపై 40 శాతం వరకు హెయిర్‌కట్ విధించనున్నారు. ఇప్పటికే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న ప్రొప్రైటరీ ట్రేడర్లపై ఈ నగదు కాలేటరల్ నిబంధనలు పెద్ద భారం కానున్నాయి. ఈ కారణంగా బీఎస్‌ఈ లాభాలు దాదాపు 10 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి.

వివరాలు 

రిటైల్ బ్రోకర్లపై ప్రభావం

ఈ కొత్త నిబంధనల ప్రభావం రిటైల్ బ్రోకర్లపై తక్షణమే పడనుంది. ఏంజెల్ వన్ సంస్థ తన మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ (ఎంఎటీఎఫ్) బుక్‌కు సంబంధించిన ఫండింగ్ విధానాన్ని తిరిగి సమీక్షించుకోవాల్సి రావచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆ సంస్థ ఎంఎటీఎఫ్ బుక్ విలువ రూ.6,100 కోట్లుగా ఉంది. మరోవైపు, మార్జిన్ ట్రేడింగ్‌లో 2 శాతం మార్కెట్ వాటా ఉన్న గ్రోవ్ తన ఎంఎటీఎఫ్ అవసరాల కోసం స్వంత ఈక్విటీనే వినియోగిస్తోంది. అయితే నగదు, ఆప్షన్ల మార్కెట్లలో లిక్విడిటీ తగ్గితే, ప్రొప్రైటరీ ట్రేడర్లు వెనక్కి తగ్గే పరిస్థితి ఏర్పడితే రెండో దశ ప్రభావం కూడా ఉండొచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

వివరాలు 

బ్యాంకుల నుంచి రుణాల తలుపులు మూసినట్లే

కొత్త ఫ్రేమ్‌వర్క్‌తో చాలా బ్రోకర్లకు బ్యాంకుల నుంచి రుణాలు పొందే అవకాశం దాదాపుగా మూసుకుపోయినట్లే అయింది. ఫలితంగా వారు కమర్షియల్ పేపర్లు, నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్లు వంటి ఖరీదైన ప్రత్యామ్నాయ మార్గాల వైపు మొగ్గు చూపాల్సి వస్తోంది. ఇకపై బ్యాంకులు ప్రొప్రైటరీ ట్రేడింగ్‌కు రుణాలు ఇవ్వలేవు. బ్రోకర్లకు సంబంధించిన అన్ని ఎక్స్‌పోజర్లను క్యాపిటల్ మార్కెట్ ఎక్స్‌పోజర్‌గా పరిగణించాల్సి ఉంటుంది. దీంతో ఈ రంగానికి రుణాలు ఇవ్వడంపై బ్యాంకులు మరింత వెనుకడుగు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టాక్ ఎక్స్చేంజీలకు ఇచ్చే బ్యాంక్ గ్యారంటీలకు కూడా కనీసం 50 శాతం కాలేటరల్ అవసరం కాగా, అందులో 25 శాతం నగదు రూపంలో ఉండాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

Advertisement

వివరాలు 

ఎన్‌బీఎఫ్‌సీల వైపు మళ్లే అవకాశం

ఈ పరిణామాల నేపథ్యంలో ఏంజెల్ వన్ బ్యాంకులకన్నా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల నుంచి రుణాలు తీసుకునే దిశగా అడుగులు వేయనుంది. 2025 మార్చి నాటికి ఎన్‌బీఎఫ్‌సీలతో రూ.800 కోట్ల బాకీలు ఉన్న ఈ సంస్థ, కమర్షియల్ పేపర్లతో పాటు ఎన్‌సీడీ ఆఫర్లపై కూడా దృష్టి సారిస్తోంది. ఇక గ్రోవ్ సంస్థకు త్రైమాసిక లాభం రూ.5.5 బిలియన్లుగా నమోదవ్వగా, ఐపీఓ ద్వారా రూ.1.1 బిలియన్ సమీకరించింది. అయినప్పటికీ, ఒక్క త్రైమాసికంలోనే మార్జిన్ ట్రేడింగ్ బుక్ నాలుగు రెట్లు పెరగడంతో, భవిష్యత్తులో రుణ మార్కెట్లను ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

Advertisement