Page Loader
Gold: ధనత్రయోదశికి బంగారం ఏ రూపంలో బంగారం కొంటే ఎంత పన్ను వర్తిస్తుందో తెలుసా?
ధనత్రయోదశికి బంగారం ఏ రూపంలో బంగారం కొంటే ఎంత పన్ను వర్తిస్తుందో తెలుసా?

Gold: ధనత్రయోదశికి బంగారం ఏ రూపంలో బంగారం కొంటే ఎంత పన్ను వర్తిస్తుందో తెలుసా?

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 24, 2024
03:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

ధన త్రయోదశి పండుగ సందర్భంగా బంగారం కొనుగోలు చేయడం చాలా మందికి ఆచారంగా మారింది. ఈ రోజు ప్రత్యేకంగా ఒక గ్రాము బంగారం అయినా కొనుగోలు చేయాలని భావించే వారు ఉంటారు. పండగకాలంలో బంగారానికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, నగల వ్యాపారులు అనేక ఆఫర్లను అందిస్తారు, దీని వల్ల అధిక సంఖ్యలో ప్రజలు ఆభరణాల కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. బంగారాన్ని కొనుగోలు చేయాలంటే,అది ఆభరణాల రూపంలో మాత్రమే కాకుండా,డిజిటల్ గానూ, బాండ్ల రూపంలోనూ కొనుగోలు చేయవచ్చు. మీ కొనుగోలు ఉద్దేశం ప్రకారం,మీరు బంగారం కొనుగోలు చేయవలసి ఉంటుంది. సొంత వినియోగానికి కావాలంటే నగల రూపంలో కొనుగోలు చేయవచ్చు,కానీ పెట్టుబడుల కోసం సార్వభౌమ పసిడి పథకాలు లేదా గోల్డ్ ఈటీఎఫ్‌లను పరిగణించాలి.

వివరాలు 

మూలధన రాబడి 

అయితే,బంగారంలో పెట్టుబడులకు ఆదాయపు పన్ను వర్తిస్తుందనేది గుర్తించాలి. బంగారం విక్రయించినప్పుడు వచ్చే మూలధన రాబడిపై పన్ను ఉంటుంది. ఇది రెండు రకాలుగా ఉంది: స్వల్పకాలిక మూలధన రాబడి (ఎస్‌టీసీజీ),దీర్ఘకాలిక మూలధన రాబడి (ఎల్‌టీసీజీ). మీరు బంగారం కొనుగోలు చేసిన మూడేళ్లలోపు విక్రయిస్తే, అది స్వల్పకాలికంగా పరిగణించబడుతుంది. మూడేళ్ల తర్వాత విక్రయించినప్పుడు దీర్ఘకాలికంగా పరిగణిస్తారు. భౌతిక బంగారం బంగారు నాణేలు,బిస్కెట్లు,ఆభరణాల రూపంలో భౌతిక బంగారం లభిస్తుంది. 24 క్యారెట్ల బంగారాన్ని నాణేలు, బిస్కెట్ల రూపంలో కొనుగోలు చేయవచ్చు.అలాగే 22 క్యారెట్ల బంగారం ఆభరణాల రూపంలో లభిస్తుంది.భౌతిక బంగారాన్ని విక్రయించేటప్పుడు,స్వల్పకాల మూలధన రాబడిని ఆదాయానికి చేర్చి,వర్తించే స్లాబ్ ప్రకారం పన్ను లెక్కిస్తారు. దీర్ఘకాల మూలధన రాబడిపై 20% పన్ను (సెస్‌తో కలిపి) ఉంటుంది.

వివరాలు 

వ్యాపారులకు పన్ను విధానం 

మూలధన రాబడిపై పన్ను వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుంది, వ్యాపారులకు కాదు. వ్యాపారులు బంగారం అమ్మినప్పుడు వచ్చిన రాబడిని వ్యాపార ఆదాయంగా పరిగణిస్తారు. భౌతిక బంగారం కొనుగోలుపై 3% జీఎస్‌టీ, తయారీ ఛార్జీలపై 5% జీఎస్‌టీ వర్తిస్తుంది. గోల్డ్‌ ఈటీఎఫ్‌లు, ఫండ్లు గోల్డ్‌ ఈటీఎఫ్‌లు స్టాక్ ఎక్స్‌ఛేంజీల్లో ట్రేడ్ అవుతాయి. ఒక గోల్డ్‌ ఈటీఎఫ్‌ యూనిట్, 1 గ్రాము బంగారంతో సమానం. వీటిపై వచ్చిన మూలధన రాబడిపై ఫిజికల్‌ గోల్డ్‌కు వర్తించినట్లుగానే పన్ను వర్తిస్తుంది. డిజిటల్‌ గోల్డ్ మొబైల్‌ వ్యాలెట్ల ద్వారా కొనుగోలు చేసే బంగారాన్ని డిజిటల్‌ గోల్డ్‌గా పిలుస్తారు. దీనిపై కూడా ఫిజికల్‌ గోల్డ్‌ మాదిరిగానే పన్నులు వర్తిస్తాయి.

వివరాలు 

సావరిన్‌ బాండ్లు 

సార్వభౌమ పసిడి బాండ్లు ప్రభుత్వ సెక్యూరిటీలు, 1యూనిట్‌ 1గ్రాము బంగారంతో సమానం. ఇవి ఆర్‌ బి ఐ ద్వారా జారీ చేయబడతాయి. మెచ్యూరిటీ గడువు 8సంవత్సరాలు. ఐదో సంవత్సరం తర్వాత ప్రీమెచ్యూర్‌ విత్‌డ్రాలను అనుమతిస్తారు. మెచ్యూరిటీ వరకు కొనసాగిస్తే మూలధన రాబడిపై పన్ను ఉండదు, కానీ ముందుగా విత్‌డ్రా చేసుకుంటే దీర్ఘకాల మూలధన రాబడిపై 20% పన్ను వర్తిస్తుంది. గోల్డ్‌ మానిటైజేషన్‌ స్కీమ్ 2015లో ప్రారంభమైన ఈ పథకం,ఇళ్లలో వృథాగా ఉన్న బంగారాన్ని వాడుకలోకి తెచ్చేందుకు, బంగారం దిగుమతులను తగ్గించడానికి రూపొందించబడింది.ఈ స్కీమ్‌ కింద ఎవరైనా తమ బంగారాన్ని డిపాజిట్‌ చేసి వడ్డీ పొందవచ్చు.ఈ పథకంలో పాత బంగారం డిపాజిట్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ పన్ను ప్రయోజనాలను అందిస్తోంది.మూలధన రాబడిపై కూడా పన్ను ఉండదు.