Johnson & Johnson: జాన్సన్ & జాన్సన్ కంపెనీ పై న్యూజెర్సీ ఫెడరల్ కోర్టులో పిటిషన్
జాన్సన్ & జాన్సన్ (J&J)కంపెనీ ఉత్పత్తులపై మళ్లీ వివాదం రాజుకుంది. ఆ కంపెనీ ఉత్పత్తుల వల్ల తమ ఆరోగ్యాలు పాడవుతున్నాయని ఈ సారి ఏకంగా న్యూజెర్సీ ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ కంపెనీ టాల్కమ్ పౌడర్ లో రాతి పలక (ఆస్ బెస్టాస్ ) పొడి కలిసిందని కోర్టు దృష్టికి తెచ్చారు. దీని వల్ల వాడిన వారు కాన్సర్ బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజలను మభ్యపెట్టేలా ప్రచారం
ఆ పిటిషన్ లో ప్రజలను తప్పుదోవ పట్టించే రీతిలో ఉత్పత్తులకు ప్రచారం కల్పిస్తున్నారని ఆరోపించారు. ఈ కారణంతో వేలాది మంది కాన్సర్ తో బాధపడుతున్నారని విన్నవించింది. ఈ వేలాది వ్యాజ్యాలను పిటిషన్లను పరిష్కరించకుండా అడ్డుకోవటానికి J&J కంపెనీ చేస్తున్న ప్రయత్నాలను నిలువరించాలని విజ్ఞప్తి చేసింది. విచారణకు రాకుండా చేయటానికి నిరంతర ప్రయత్నాలు చేస్తుందని ఫెడరల్ కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. ఇలా మోసానికి పాల్పడుతున్న ఆరోగ్య సంరక్షణ సంస్థపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరింది.
ఆశగా ఎదురు చూస్తున్న 50 వేలమంది బాధితులు
ఫెడరల్ కోర్టు సానుకూలంగా స్పందిస్తుందని 50 వేల మంది ఆశాభావంతో ఉన్నారు. అప్పడు నష్టపరిహారంకింద బాధితులకు బిలియన్ల డాలర్లుJ&J చెల్లించాల్సి వస్తుంది. అందుకే కంపెనీ ఈ పిటిషన్ దారులైన మహిళలను అడ్డుకుంటోందని వారి తరపు న్యాయవాది మైక్ పాపన్టో ఆరోపించారు. ఈ ప్రయత్నాలను నిరోధించటానికి J&J దివాళా తీసినట్లు పిటిషన్ దారులను మోసం చేస్తుందన్నారు .