LOADING...
Rs 500 Currency Notes: రూ.500 నోట్లు రద్దు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం 
రూ.500 నోట్లు రద్దు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

Rs 500 Currency Notes: రూ.500 నోట్లు రద్దు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 07, 2025
11:54 am

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూ.2,000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. 2023 మే 19న ఆర్‌బీఐ ఈ నిర్ణయాన్ని ప్రకటించి, వాటిని చలామణి నుంచి ఉపసంహరించుకుంది. ఇదిలా ఉండగా.. తాజాగా రూ.500 నోట్లను కూడా రద్దు చేస్తున్నట్లు వార్తలు సోష‌ల్‌మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. ప్రత్యేకంగా 2026 మార్చి నాటికి రూ.500 నోట్లు పూర్తిగా చలామణి నుంచి తప్పిస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో 'కాపిటల్ టీవీ' అనే యూట్యూబ్‌ ఛానల్‌ ఓ వీడియోను విడుదల చేసింది. దీని ద్వారా 2026 మార్చి నాటికి రూ.500 నోట్లను ప్రభుత్వం ఉపసంహరించనుందంటూ వెల్లడించింది.

Details

రూమర్స్ ను నమ్మకండి

సుమారు 12 నిమిషాల నిడివి గల ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్‌ అవుతోంది. అయితే ఈ ప్రచారంపై కేంద్ర సమాచార శాఖకు చెందిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌ అధికారికంగా స్పందించింది. ''ప్రభుత్వం రూ.500 నోట్లను రద్దు చేయాలని ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దేశవ్యాప్తంగా ఈ నోట్లు చట్టబద్ధంగా చెలామణిలో ఉన్నాయి. వాటి జారీ, స్వీకరణ యథావిధిగా కొనసాగుతోంది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అసత్యం. అలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని స్పష్టం చేసింది. ఇక ఇప్పటికే ప్రజల్లో ఈ రూమర్స్‌పై భయం మొదలవుతున్న వేళ, పీఐబీ స్పష్టతతో అవగాహన కలుగుతోంది. ప్రజలు ఎటువంటి అపోహలు లేకుండా చట్టబద్ధంగా చెలామణిలో ఉన్న రూ.500 నోట్లను నమ్మకంగా వినియోగించొచ్చని స్పష్టమైంది.