
Tatkal ticket booking: ఇకపై తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు.. మారిన టైమింగ్స్, నూతన విధానాలివే!
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్ వ్యవస్థలో కీలక మార్పులు తీసుకొచ్చింది. కొత్త నియమాలు 2025 ఏప్రిల్ 15 నుండి అమలులోకి రానున్నాయి.
టికెట్ బుకింగ్ టైమింగ్, క్యాన్సిలేషన్ విధానం, చెల్లింపు విధానం సహా అనేక అంశాల్లో ఈ మార్పులు చోటుచేసుకోనున్నాయి.
ఈ మార్పుల ప్రధాన ఉద్దేశ్యం, తత్కాల్ టికెట్ రిజర్వేషన్‌ను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చడం కోసమే అని పేర్కొంది.
తత్కాల్ అంటే ప్రయాణానికి తక్కువ సమయం ఉండగా టికెట్ రిజర్వ్ చేసుకునే విధానం.
అయితే, ఏజెంట్లు దుర్వినియోగం, సాంకేతిక లోపాలు, అధిక డిమాండ్ కారణంగా గతంలో కొంత అవ్యవస్థ నెలకొనేది. అందుకే రైల్వే శాఖ ఈ కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చింది.
Details
కొత్త టికెట్ బుకింగ్ టైమింగ్‌లు (ఏప్రిల్ 15 నుంచి అమలులోకి)
ఏసీ క్లాస్ టికెట్ల బుకింగ్ - ఉదయం 11:00 గంటలకి
నాన్-ఏసీ / స్లీపర్ క్లాస్ టికెట్ల బుకింగ్ - మధ్యాహ్నం 12:00 గంటలకి
ప్రీమియం తత్కాల్ టికెట్ల బుకింగ్ - ఉదయం 10:30 గంటలకి
రేపు ట్రైన్ ఉంటే, ఈ రోజే తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలి.
టికెట్ బుకింగ్ ప్రక్రియ (IRCTC వెబ్‌సైట్ / యాప్‌లో)
1. IRCTC అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్‌కి లాగిన్ అవ్వాలి
2. ట్రైన్ & క్లాస్ ఎంపిక చేసుకోవాలి
3. కోటా నుంచి 'తత్కాల్'ను సెలెక్ట్ చేయాలి
4. ప్రయాణికుల వివరాలు, ఐడీ ప్రూఫ్ నంబర్ ఎంటర్ చేయాలి
5. చెల్లింపు చేసి టికెట్ బుక్ చేయాలి
Details
తత్కాల్ రూల్స్‌లో కొత్త మార్పులు
ప్రయాణికుల వివరాలు ముందుగానే భర్తీ చేసే ఆప్షన్ అందుబాటులోకి
చెల్లింపు గడువు 3 నిమిషాల నుంచి 5 నిమిషాలకు పెంపు
కాప్చా వేరిఫికేషన్ సిస్టమ్ మరింత సరళీకరణ
వెబ్‌సైట్, యాప్ రెండింటికీ ఒకే విధమైన లాగిన్ విధానం
ఒక PNR కింద గరిష్టంగా నలుగురు ప్రయాణికులకు మాత్రమే టికెట్లు
తత్కాల్ కోటాలో ఎటువంటి రాయితీలు వర్తించవు - ప్రయాణ సమయంలో ఐడీ ప్రూఫ్ తప్పనిసరి
ఈ మార్పులతో ప్రయాణికులకు మరింత సౌలభ్యంగా, వేగంగా టికెట్ బుకింగ్ చేసుకునే అవకాశముంటుంది. తత్కాల్ టికెట్ కోసం ప్లాన్ చేస్తున్న వారు ఈ కొత్త మార్గదర్శకాలను తప్పనిసరిగా తెలుసుకుని ముందస్తుగా సిద్ధమవ్వాలి.