
New Financial year 2025: ఏప్రిల్ 1 నుండి UPI చెల్లింపులు, GST, ఆదాయపు పన్ను స్లాబ్‌లలో మార్పులు
ఈ వార్తాకథనం ఏంటి
కొత్త ఆర్థిక సంవత్సరం 2025-26లోకి అడుగు పెట్టాం. ఈ నేపథ్యంలో, మన ఆర్థిక లావాదేవీలపై ప్రభావం చూపే కొన్ని ముఖ్యమైన మార్పులను తెలుసుకోవడం అవసరం.
ఈ మార్పుల్లో కొన్ని ముఖ్యమైన అంశాలు ఇవే:
ఆదాయపు పన్ను: సాధారణ వ్యక్తులకు ₹12 లక్షల వరకు ఆదాయపు పన్ను లేదు. ఉద్యోగులకు ప్రామాణిక తగ్గింపు ₹75,000 కలిపి, ₹12,75,000 వరకు పన్ను వర్తించదు. ఈ పరిమితిని మించి ఉన్నవారికి పన్ను శ్లాబుల ప్రకారం పన్ను విధిస్తారు.
వివరాలు
ఈ మార్పుల్లో కొన్ని ముఖ్యమైన అంశాలు ఇవే:
గృహ రుణాలు: ఏప్రిల్ 1 నుండి, పెద్ద నగరాల్లో ₹50 లక్షల వరకు, మధ్య తరహా నగరాల్లో ₹45 లక్షల వరకు, చిన్న పట్టణాల్లో ₹35 లక్షల వరకు గృహ రుణాలు ప్రాధాన్య రంగ రుణాలుగా లభిస్తాయి.
యూపీఐ సేవలు: గత 12 నెలలుగా ఉపయోగంలో లేని మొబైల్ నంబర్లకు అనుసంధానంగా ఉన్న యూపీఐ ఐడీలు నేటి నుండి పనిచేయవు. కొత్త నంబర్‌ను బ్యాంకులో నమోదు చేయాలి. ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కూడా కొత్త నంబర్లను అప్‌డేట్ చేసుకోవచ్చు.
వడ్డీ ఆదాయంపై టీడీఎస్: సీనియర్ సిటిజన్లకు ₹1 లక్ష వరకూ వడ్డీ ఆదాయంపై మూలం వద్ద పన్ను (టీడీఎస్) వర్తించదు.
వివరాలు
ఈ మార్పుల్లో కొన్ని ముఖ్యమైన అంశాలు ఇవే:
ఆధార్-పాన్ అనుసంధానం: ఆధార్‌ను పాన్ కార్డుతో అనుసంధానం చేయకపోతే,ఏప్రిల్ 1 నుంచి డివిడెండ్ల రూపంలో ఆదాయం అందదు.టీడీఎస్ రేటు పెరుగుతుంది.పన్ను వసూలు అయినా,అది ఫారం 26ASలో కనిపించదు.
విదేశీ ప్రయాణం, పెట్టుబడులపై టీసీఎస్: టీసీఎస్ పరిమితి ₹7 లక్షల నుంచి ₹10 లక్షలకు పెంచబడింది.
కేవైసీ & నామినీ వివరాలు: డీమ్యాట్ ఖాతా, మ్యూచువల్ ఫండ్ ఖాతాలకు సంబంధించిన కేవైసీ వివరాలను తిరిగి సమర్పించాలి. నామినీ వివరాలను ధృవీకరించాలి.
హోటల్ అద్దె & జీఎస్‌టీ: ₹7,500 పైగా గది అద్దె ఉన్న హోటళ్లలో రెస్టారెంట్ సేవలపై 18% జీఎస్‌టీ వర్తిస్తుంది.
వివరాలు
ఈ మార్పుల్లో కొన్ని ముఖ్యమైన అంశాలు ఇవే:
ఆదాయపు పన్ను అప్‌డేటెడ్ రిటర్న్ గడువు: ఆదాయపు పన్ను అప్‌డేటెడ్ రిటర్నులు దాఖలు చేసేందుకు గడువు 12 నెలల నుంచి 48 నెలలకు పెంచబడింది.
చెక్కు చెల్లింపులు: ₹50,000కు పైగా ఉన్న చెక్కుల కోసం ఖాతాదారులు ఎలక్ట్రానిక్ రూపంలో వివరాలు సమర్పించాలి. చెక్కు సంఖ్య, పొందేవారి వివరాలు, మొత్తం తదితర వివరాలను బ్యాంకు ధృవీకరించిన తర్వాత మాత్రమే చెల్లింపు జరుగుతుంది.
యులిప్ పాలసీల పన్ను: ₹2.5 లక్షలకు మించి ప్రీమియం చెల్లించిన యూనిట్ ఆధారిత బీమా పాలసీలను (యులిప్) వెనక్కి తీసుకున్నప్పుడు వచ్చిన లాభాన్ని మూలధన రాబడిగా పరిగణిస్తారు. దీనికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
ఈ మార్పులు 2025-26 ఆర్థిక సంవత్సరం నూతన నిబంధనల ప్రకారం అమలవుతాయి.