Gold Price: వినియోగదారులకు షాక్.. ఆకాశాన్ని అంటిని పసిడి, వెండి ధరలు!
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో పసిడి ధరలు నాన్‌స్టాప్‌గా పెరుగుతుండటంతో వినియోగదారులు షాక్‌కు గురవుతున్నారు. ఇటీవలి కాలంలో స్వల్పంగా తగ్గినట్లైనా, బంగారం మళ్లీ లక్ష మార్క్‌ను దాటేసింది. ఇదే సమయంలో వెండి ధరలు కూడా ఊహించని రీతిలో పెరిగిపోతుండటంతో కొనుగోలుదారులు దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. తాజాగా జులై 22, 2025 మంగళవారం నాడు పలు ప్రముఖ వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం, దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగినట్లు స్పష్టమవుతోంది.
Details
బంగారం, వెండి ధరల తాజా స్థితి
24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,01,290 - ధరలో రూ.1140 పెరుగుదల
22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.92,850 - ధరలో రూ.1050 పెరుగుదల
వెండి కిలో ధర రూ.1,18,000 - ధరలో రూ.2,000 పెరుగుదల
ఈ ధరల పెరుగుదల వెనుక కారణంగా, అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలే ప్రధానంగా పేర్కొంటున్నారు.
నిపుణులు. బులియన్ మార్కెట్‌లో సాధారణంగా ధరలు ఎప్పటికప్పుడు మారుతుండటం సహజమే అయినప్పటికీ, ఇటీవలి పెరుగుదల తీవ్రంగా ఉందనే చెప్పాలి.
Details
నగరాల వారీగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి
హైదరాబాద్:
24 క్యారెట్లు - రూ.1,01,290
22 క్యారెట్లు - రూ.92,850
వెండి (కిలో) - రూ.1,28,000
విజయవాడ, విశాఖపట్నం
24 క్యారెట్లు - రూ.1,00,040
22 క్యారెట్లు - రూ.91,700
వెండి (కిలో) - రూ.1,28,000
దిల్లీ
24 క్యారెట్లు - రూ.1,01,440
22 క్యారెట్లు - రూ.93,000
వెండి (కిలో) - రూ.1,18,000
ముంబయి
24 క్యారెట్లు - రూ.1,01,290
22 క్యారెట్లు - రూ.92,850
వెండి (కిలో) - రూ.1,18,000
చెన్నై
24 క్యారెట్లు - రూ.1,01,290
22 క్యారెట్లు - రూ.92,850
వెండి (కిలో) - రూ.1,28,000
Details
బెంగళూరు
24 క్యారెట్లు - రూ.1,01,290
22 క్యారెట్లు - రూ.92,850
వెండి (కిలో) - రూ.1,18,000
ప్రస్తుతం బంగారం, వెండి కొనుగోలుపై దృష్టి పెట్టినవారు మార్కెట్‌పై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
చిన్న పెరుగుదలలు ఒక్కసారిగా భారీ ధరల పెరుగుదలకు దారితీయవచ్చునన్న ఆందోళనలూ స్పష్టంగా కనిపిస్తున్నాయి.