Credit Cards: నేటి నుంచి మారిన క్రెడిట్ కార్డ్ రూల్స్.. రివార్డ్స్, ఈఎంఐ, చార్జీలపై తాజా మార్పులు
క్రెడిట్ కార్డు వినియోగదారులకు ముఖ్య సమాచారం. తాజాగా ఎస్‌బీఐ, ఐసీఐసీఐ వంటి ప్రధాన బ్యాంకులు తమ క్రెడిట్ కార్డు నిబంధనల్లో మార్పులు ప్రవేశపెట్టాయి. ఈ మార్పులు శుక్రవారం నుంచే అమలులోకి వచ్చాయి. క్రెడిట్ కార్డు వినియోగదారులు రివార్డ్ పాయింట్ల వ్యాలిడిటీ, ఆన్‌లైన్ చెల్లింపులు, ఫ్యూయెల్ సర్‌చార్జీలలోని మార్పులను తెలుసుకొని జాగ్రత్తగా వాడుకోవడం మంచిది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుల్లో మార్పులు ఎస్‌బీఐ రివార్డ్ పాయింట్లను పరిమిత కాలం వరకు మాత్రమే చెల్లుబాటుగా ఉంచింది. నిర్దిష్ట సమయంలో రివార్డ్ పాయింట్లను వినియోగించకపోతే అవి లేనిపోకవచ్చు. ఈఎంఐ ద్వారా చేసే కొనుగోళ్లపై కొన్ని అదనపు చార్జీలు అమలు చేయనుంది. ఇది అధిక మొత్తంలో కొనుగోలు చేసే వినియోగదారులకు ప్రభావం చూపవచ్చు
ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుల్లో మార్పులు
ఆన్‌లైన్ బిల్లు చెల్లింపులు మరియు ఆటో డెబిట్ లావాదేవీలకు సంబంధించిన చార్జీలలోనూ మార్పులు ఉన్నాయి. దీని ప్రకారం ఈ సేవలపై కొంత అదనపు చార్జీ వసూలు అవుతుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుల్లో ఇంధన సర్‌చార్జీ మినహాయింపుల్లో మార్పులు చేసుకుంది. కొన్ని కార్డుల్లో ఈ సదుపాయాన్ని పూర్తిగా తొలగించగా, మరికొన్నింటిలో పరిమితులకు లోబడి అందుబాటులో ఉంచింది. రివార్డ్ పాయింట్ల రిడెంప్షన్‌కి సంబంధించి, నూతన నియమాలు ప్రవేశపెట్టింది. ఇవి కేటగిరీ ఆధారంగా పరిమితులను కలిగి ఉంటాయి. కార్డు రకం, లావాదేవీల ప్రకారం ఈఎంఐ వడ్డీ రేట్లు కూడా మారనున్నాయి. కాబట్టి వినియోగదారులు ఈ వివరాలను తెలుసుకొని సరైన నిర్ణయం తీసుకోవాలి.