Crude Oil : 5 శాతానికి తగ్గిన ముడి చమురు..4 నెలల కనిష్టం
ఈ వార్తాకథనం ఏంటి
ముడి చమురు ధరలు దాదాపుగా 5 శాతం క్షీణించాయి. ఈ మేరకు నవంబర్ 16న నాలుగు నెలల కనిష్టానికి పడిపోయాయి.
US క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీల పెరుగుదల, అమెరికా ట్రెజరీ దిగుబడిలో పుంజుకోవడం, ప్రపంచ చమురు డిమాండ్ ఆందోళనల కారణంగానే ఈ ధర తగ్గింది.
గత ట్రేడింగ్ సెషన్‌లో, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 4.63% తగ్గి 77.42 డాలర్లకి చేరుకుంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 4.9 శాతం మేర పడిపోయి 72.90 డాలర్లకు చేరుకుంది.
గత నాలుగు వారాల్లో రెండు సూచీలు వాటి విలువలో దాదాపు ఆరో వంతును కోల్పోయాయి. ముడి చమురు ధరలు దాదాపు 5 శాతం క్షీణించి నాలుగు నెలల కనిష్టానికి చేరాయి.
details
ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ మేరకు గత వారంలో 3.59 మి.బ్యారెల్స్ పెరిగాయి
ఇదే సమయంలో గత నాలుగు వారాల్లో, రెండు సూచీలు వాటి విలువలో దాదాపు ఆరో వంతును కోల్పోవడం గమనార్హం.
చమురు ధరల తగ్గుదలకు US క్రూడ్ ఇన్వెంటరీలలో గణనీయమైన పెరుగుదల, అధిక ఉత్పత్తి నేపథ్యంలో బలహీనమైన డిమాండ్ ఆందోళనలకు దారితీసిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
EIA మేరకు US ముడి చమురు నిల్వలు గత వారంలో 3.59మిలియన్ బ్యారెల్స్ పెరిగాయి.ఇది కేవలం 439 మిలియన్ బ్యారెల్స్‌కు చేరుకుంది. ఆగస్టు తర్వాత ఇది గరిష్ట స్థాయి, అంతకుముందు వారంలో 13.9 మిలియన్ బ్యారెల్ పెరుగుదల చూపించింది.
చైనాలో కాలానుగుణ ప్రభావం, డిమాండ్ ఏర్పడటంతో అక్టోబర్‌లో, చైనీస్ ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్నా తగ్గిన రిఫైనింగ్ మార్జిన్ల కారణంగా చైనా చమురు శుద్ధి కర్మాగారం అక్టోబర్‌లో క్షీణతను చవిచూసింది.