LOADING...
DA Hike: డీఏ పెంపుపై భారీ శుభవార్త చెప్పనున్న ప్రభుత్వం.. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు భారీగా పెరుగుతాయి 
కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు భారీగా పెరుగుతాయి

DA Hike: డీఏ పెంపుపై భారీ శుభవార్త చెప్పనున్న ప్రభుత్వం.. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు భారీగా పెరుగుతాయి 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 08, 2025
10:09 am

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లు చాలా కాలంగా 8వ వేతన సంఘం ఏర్పాటుపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. ఇంతలో, వారికి మరో శుభవార్త రానుంది. త్వరలోనే డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెంపు ప్రకటించనున్నట్టు సమాచారం. ముఖ్యంగా దీపావళి పండుగ ముందు ఈ ప్రకటన వెలువడే అవకాశాన్ని భావిస్తూ ఉద్యోగులు, పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ DA పెంపుతో సుమారు 1.2 కోట్ల కేంద్ర ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఉపశమనం పొందనున్నారు. ముఖ్య పండుగలు అయిన దసరా, దీపావళికి ముందే అదనపు డబ్బు వస్తుండటంతో, వారి ఖర్చులు, జీవనశైలి మెరుగవుతాయని అంచనా వేస్తున్నారు.

వివరాలు 

ఉద్యోగులు,పెన్షనర్లకు స్థిరమైన ఆర్థిక భరోసా

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే DA శాతము 55% వద్ద ఉంది.ఆర్థిక నిపుణుల అంచనాల ప్రకారం,దీన్ని మరో 3 శాతం పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. సాధారణంగా DA పెంపు ప్రతి సంవత్సరం జనవరి, జూలై నెలల్లో రెండు సార్లు ప్రకటించబడుతుంది. 2025 జూలై నుండి అమల్లోకి రావాల్సిన పెంపు 3% నుంచి 4% మధ్య ఉండే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పెంపు ఫిబ్రవరి-మార్చి లేదా సెప్టెంబర్-అక్టోబర్ మధ్యలో ప్రకటించబడుతుందని తెలుస్తోంది. కానీ ఇది జనవరి, జూలై నెలల నుంచి రిట్రోస్పెక్టివ్‌గా అమలులోకి వస్తుంది. దీని ముఖ్య ఉద్దేశ్యం, ద్రవ్యోల్బణం కారణంగా పెరిగిన ఖర్చును ఉద్యోగులు, పెన్షనర్లు తట్టుకునేలా సహాయపడటం. దీంతో వారికి కొంత స్థిరమైన ఆర్థిక భరోసా లభిస్తుంది.

వివరాలు 

DA పెంపుకు ప్రత్యేక గణన పద్ధతి

DA పెంపు యాదృచ్ఛికంగా నిర్ణయించబడదు.దానికి ప్రత్యేక గణన పద్ధతి ఉంటుంది. ప్రభుత్వం ప్రతి నెలా విడుదల చేసే పారిశ్రామిక కార్మికుల వినియోగదారుల ధరల సూచిక (CPI-IW) ఆధారంగా గత 12 నెలల CPI-IW డేటా సగటుగా తీసుకుని, 7వ వేతన సంఘం కింద ఒక నిర్దిష్ట సూత్రాన్ని అనుసరిస్తుంది. ఉదాహరణకి, ప్రాథమిక CPI-IW సగటును నిర్ణయించే సమయంలో 261.42 అనే సంఖ్యను 2016 బేస్ ఇయర్‌గా ఆధారంగా తీసుకుంటారు. ఈ గణన విధానం ప్రకారం DA పెంపు శాతం ఖరారు చేస్తారు. ఈ DA పెంపు ఉద్యోగుల జీతంపై ఎలా ప్రభావం చూపుతుందో చూద్దాం.

వివరాలు 

ఈ DA పెంపుతో పండుగ సీజన్‌లో కేంద్ర ఉద్యోగులు,పెన్షనర్లకు ఆర్థిక భరోసా

ఉదాహరణికి, ప్రాథమిక జీతం రూ. 18,000 ఉన్న ప్రారంభ స్థాయి కేంద్ర ఉద్యోగికి ప్రస్తుతం 53% DA, అంటే రూ. 9,990 వస్తోంది. 3% పెంపు జరిగితే, DA మొత్తం రూ. 10,440కి పెరుగుతుంది. అంటే నెలకు రూ. 540 అదనంగా వస్తుంది. అంతే కాదు, ప్రాథమిక జీతం ఎక్కువగా ఉన్న ఉద్యోగులకు పెంపు మొత్తం మరింత అధికంగా ఉంటుంది. మొత్తం మీద, ఈ DA పెంపుతో పండుగ సీజన్‌లో కేంద్ర ఉద్యోగులు,పెన్షనర్ల ఆర్థిక భరోసా పెరిగిపోతుంది. ద్రవ్యోల్బణం కారణంగా పెరిగిన ఖర్చులను కొంతవరకు సమతుల్యం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. అలాగే, రాబోయే 8వ వేతన సంఘంపై కూడా ఆశలు పెరుగుతున్న తరుణంలో, ఈ పెంపు వారికి తాత్కాలిక సాంత్వనగా నిలుస్తుంది.