LOADING...
విమానాల్లో వికృత చేష్టలకు పాల్పడే ప్రయాణికులపై చర్యలకు 'డీజీసీఏ' కీలక సూచనలు 
విమానాల్లో వికృత చేష్టలకు పాల్పడే ప్రయాణికులపై చర్యలకు 'డీజీసీఏ' కీలక సూచనలు

విమానాల్లో వికృత చేష్టలకు పాల్పడే ప్రయాణికులపై చర్యలకు 'డీజీసీఏ' కీలక సూచనలు 

వ్రాసిన వారు Stalin
Apr 11, 2023
10:43 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల విమానాల్లో కొందరు ప్రయాణికుల వికృత చేష్టలు పెరిగిపోతున్న నేపథ్యంలో విమానయాన సంస్థలకు ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కీలక సూచనలను జారీ చేసింది. అసభ్యకరంగా ప్రవర్తించే ప్రయాణీకులను ఎదుర్కోవటానికి ఇప్పటికే ఉన్న నిబంధనలను డీజీసీఏ పునరుద్ఘాటించింది. దిల్లీ నుంచి లండన్ ఎయిర్ ఇండియా విమానంలో సోమవారం ఇద్దరు క్యాబిన్ సిబ్బందికి శారీరక హాని కలిగించినందుకు ఒక ప్రయాణికుడిని డిబోర్డ్ చేసిన నేపేథ్యంలో సివిల్ ఏవియేషన్ రిక్వైర్‌మెంట్ (సీఏఆర్) నిబంధనలను ఈ మేరకు డీజీసీఏ గుర్తు చేసింది. ఇది ఇటీవలి కేసుల్లో ఒకటి మాత్రమే, గతంలో ఇలాంటి సంఘటనలు చాలా నమోదయ్యాయి.

విమానం

'సీఏఆర్' నిబంధనలను గుర్తు చేసిన డీజీసీఏ 

ఇటీవలి కాలంలో విమానంలో ధూమపానం చేయడం, మద్యం మత్తులో వికృతంగా ప్రవర్తించడం, ప్రయాణికుల మధ్య వాగ్వాదాలు, కొన్నిసార్లు విమానంలో ప్రయాణించే సమయంలో ప్రయాణికులను అనుచితంగా తాకడం లేదా లైంగిక వేధింపులు వంటి కొన్ని సంఘటనలు తమ దృష్టికి వచ్చినట్లు డీజీసీఏ తెలిపింది. పోస్ట్ హోల్డర్లు, పైలట్లు, క్యాబిన్ సిబ్బంది తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైనట్లు డీజీసీఏ పేర్కొంది. వికృత చేష్టలకు పాల్పడుతున్న ప్రయాణీకులను ఎదుర్కోవటానికి విమానయాన సంస్థ చర్యలు తీసుకోవడానికి సివిల్ ఏవియేషన్ రిక్వైర్‌మెంట్ (సీఏఆర్) కింద నిబంధనలు ఉన్నాయని చెప్పింది. అంతేకాకుండా, పైలట్లు, క్యాబిన్ సిబ్బంది, ఇన్‌ఫ్లైట్ సర్వీసెస్ డైరెక్టర్‌ల బాధ్యతలను కూడా సీఏఆర్‌లో పేర్కొన్నట్లు తెలిపింది.