
Dhanteras 2024: 10 నిమిషాల్లో బంగారం,వెండి కాయిన్ డెలివరీ.. స్విగ్గీ, బ్లింకిట్,బిగ్ బాస్కెట్,జప్టో సేవలు!
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయులకు బంగారం అంటే ఎంతగానో ఇష్టమని చెప్పకనే చెప్పొచ్చు. ముఖ్యంగా మహిళలు బంగారాన్ని ఆభరణాల రూపంలో ధరించడం మన సాంప్రదాయంలో భాగం.
పండగలు, శుభకార్యాలు, ఇతర వేడుకల సమయంలో బంగారానికి ఉన్న డిమాండ్ మరింతగా పెరుగుతుంది.
ఇప్పుడు ధన త్రయోదశి పండగ రాగానే దేశవ్యాప్తంగా బంగారం కొనుగోళ్లకు మళ్ళీ జోరు కనిపిస్తోంది.
ఈ పండగ రోజున బంగారం కొనుగోలు చేయడం వలన ఇంటికి శుభం కలుగుతుందని, శ్రేయస్సు చేకూరుతుందని విశ్వాసం.
ప్రస్తుతం బంగారం ధరలు రికార్డు స్థాయిలో ఉన్నప్పటికీ, కనీసం ఒక్క గ్రాము అయినా కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.
వివరాలు
వివిధ ఆఫర్లతో బిగ్ బాస్కెట్, స్విగ్గీ, బ్లింకిట్
ధన్‌తేరాస్ సమయంలో కొన్ని ఆన్‌లైన్ డెలివరీ సంస్థలు ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నాయి.
టాటా బ్రాండ్ బిగ్ బాస్కెట్, తనిష్క్ జువెల్లరీతో కలిసి గోల్డ్, సిల్వర్ కాయిన్స్‌ని ఈ పండగ సీజన్‌లో ఇంటికి డెలివరీ చేయడం విశేషం.
బిగ్ బాస్కెట్ 999.9 ప్యూరిటీతో లక్ష్మీ గణేశ్ సిల్వర్ కాయిన్ (10 గ్రాములు), 22 క్యారెట్ గోల్డ్ కాయిన్స్, లక్ష్మీ మోటిఫ్ గోల్డ్ కాయిన్స్ లాంటి ఆభరణాలను అందిస్తోంది.
ముఖ్యంగా, కేవలం 10 నిమిషాల్లో హోమ్ డెలివరీ సౌకర్యం కల్పించడం వినియోగదారులకు మరింత సౌలభ్యం కల్పిస్తోంది.
బిగ్ బాస్కెట్‌తో పాటుగా, బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ కూడా ఈ 10 నిమిషాల్లో డెలివరీ సేవలను ప్రకటించాయి.
వివరాలు
ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు,పండగ పర్వదినాలు
స్విగ్గీ కూడా ధన్‌తేరాస్ రోజున ప్రత్యేకంగా గోల్డ్, సిల్వర్ కాయిన్స్, జువెల్లరీ, దేవతల విగ్రహాలు వంటి పూజా సామానులను 10నిమిషాల్లోనే వినియోగదారుల ఇంటికి చేరవేస్తున్నట్లు తెలిపింది.
ఇదే సమయంలో స్విగ్గీ ద్వారా రూ.51 వేల విలువైన రివార్డులు గెలుచుకునే అవకాశాన్ని కూడా వినియోగదారులకు అందిస్తున్నారు.
గతంలో,అక్షయ తృతీయ పండగకు కూడా బ్లింకిట్,స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి ప్లాట్‌ఫామ్‌లు పూజా సామాగ్రి,గోల్డ్,సిల్వర్ కాయిన్స్ వంటి ఆఫర్లను అందించాయి.
మళ్లీ ఇప్పుడు ధన్‌తేరాస్ పండగ సందర్భంగా ఆ ఆనందాన్ని పునరావృతం చేయాలని చూస్తున్నాయి.
ధన్‌తేరాస్ రోజున ప్రత్యేకంగా బంగారం కొనే ఆనందం,సౌభాగ్యాన్ని తెచ్చిపెడుతుందని భారతీయులు నమ్ముతారు.
ఈ పండగ సీజన్‌లో మీ ఇంట్లోకి శ్రేయస్సు తీసుకురావడానికి మీరు కూడా ఆన్‌లైన్ ఆర్డర్ చేసే ప్లాట్‌ఫామ్‌లను ట్రై చేయండి.