Aadhaar: ఆధార్ అప్‌డేట్స్ కోసం .. ఏ డాక్యుమెంట్స్ అవసరమవుతాయంటే..?
ప్రస్తుతం భారతదేశంలో ఆధార్ కార్డు అనేది చాలా అవసరమైన డాక్యుమెంట్‌గా మారిపోయింది. బ్యాంకు ఖాతా తెరవాలన్నా, పాస్‌పోర్ట్ పొందాలన్నా లేదా ఏదైనా ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నా ఆధార్ అనేది తప్పనిసరి. ఈ డాక్యుమెంట్‌లో పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, రెన్యువల్ నిబంధనల ప్రకారం, కార్డు హోల్డర్లు ప్రతి 10 సంవత్సరాలకోసారి ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. అలా చేయకపోతే, కొన్ని కీలకమైన పనులు నిలిచిపోవచ్చు.
ఇందులో వివరాలు మార్పులను బట్టి కొన్ని డాక్యుమెంట్స్ తప్పనిసరి
ఎప్పుడు పేరు, చిరునామా లేదా ఫోన్ నంబర్ మారినప్పుడు, ఆధార్‌లో సరిచేయడం తప్పనిసరి. ఇందుకోసం, ఆ మార్పును రుజువు చేసే పత్రాలను సమర్పించాలి. ఈ పత్రాలు లేకుంటే ఆధార్ వివరాలు మార్చడం సాధ్యం కాదు. మార్పుల కోసం అవసరమైన పత్రాలు: ఆధార్‌లో చేయవలసిన మార్పులను మూడు విభాగాలుగా చూడవచ్చు: వ్యక్తిగత వివరాలు (పేరు, పుట్టిన తేదీ, చిరునామా, లింగం) బయోమెట్రిక్ వివరాలు (ఫింగర్‌ప్రింట్స్) కాంటాక్ట్ వివరాలు (ఫోన్ నంబర్, ఈ-మెయిల్)
1. చిరునామా మార్పు
ఆధార్‌లో చిరునామా మార్చడానికి కొత్త చిరునామా సాక్ష్యాన్ని చూపే పత్రాలు అవసరం. ఇందులో కరెంట్ బిల్లు,నీటి బిల్లు,గ్యాస్ బిల్లు,పాస్‌పోర్ట్,ఓటర్ ID,బ్యాంక్ స్టేట్‌మెంట్ లేదా రెంటల్ అగ్రిమెంట్ వంటి పత్రాలు ఉండాలి. 2. పేరు మార్పు: పెళ్లి తర్వాత లేదా కోర్టు ఆదేశాల ప్రకారం పేరు మారిస్తే, కొత్త పేరుతో ఉన్న పాస్‌పోర్ట్,ఓటర్ ID, మ్యారేజ్ సర్టిఫికేట్ లేదా గెజిట్ నోటిఫికేషన్ వంటి పత్రాలు అవసరం. 3. పుట్టిన తేదీ మార్పు: పుట్టిన తేదీ మార్చేందుకు బర్త్ సర్టిఫికేట్, పాస్‌పోర్ట్ లేదా స్కూల్ సర్టిఫికేట్ వంటి పత్రాలు సమర్పించాలి. 4. లింగం(Gender)మార్పు: జెండర్ మార్చడానికి కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ ఆధార పత్రాలు అవసరం కావచ్చు,కానీ ఎక్కువగా ఈ మార్పు సులభంగా చేయవచ్చు.
ఆధార్ అప్‌డేట్ చేయడం ఎలా?
ఆన్‌లైన్ విధానం: UIDAI వెబ్‌సైట్‌కి వెళ్ళి, ఆధార్ నంబర్ ద్వారా లాగిన్ అవ్వాలి. మార్చాల్సిన వివరాలను ఎంచుకుని, సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేయాలి. అన్ని వివరాలు సరిచూసుకుని సబ్మిట్ చేయాలి. ఆఫ్‌లైన్ విధానం: దగ్గరలోని ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లి, అప్‌డేట్ ఫారమ్ నింపి, పత్రాలను సమర్పించాలి. అక్కడ ఫింగర్‌ప్రింట్స్, ఐరిస్ స్కాన్ చేయించుకోవాలి. పత్రాలు సరైనవిగా ఉంటే అప్‌డేట్ ప్రక్రియ పూర్తి అవుతుంది. వ్యక్తిగత వివరాలు మార్చడానికి కొంత ఫీజు ఉంటుంది. ఈ ఫీజును ఆన్‌లైన్ లేదా ఆధార్ సేవా కేంద్రంలో చెల్లించవచ్చు. మరింత సమాచారం కోసం UIDAI అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు: https://uidai.gov.in/en/.