LOADING...
Stock Market: అంతర్జాతీయ ఒత్తిడుల్లోనూ లాభాల దిశలో దేశీయ మార్కెట్లు
అంతర్జాతీయ ఒత్తిడుల్లోనూ లాభాల దిశలో దేశీయ మార్కెట్లు

Stock Market: అంతర్జాతీయ ఒత్తిడుల్లోనూ లాభాల దిశలో దేశీయ మార్కెట్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 01, 2025
10:02 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ లు ఈ వారానికి లాభాలతో శ్రీకారం చుట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వస్తున్నప్పటికీ, దేశీయ సూచీలు లాభదాయక దిశలో కొనసాగుతున్నాయి. ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్‌ 312 పాయింట్లు ఎగసి 80,121 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 95 పాయింట్ల లాభంతో 24,522 వద్ద కదలాడుతోంది. కరెన్సీ మార్కెట్లో రూపాయి ఒత్తిడిని ఎదుర్కొంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 17 పైసలు క్షీణించి, 88.26 వద్ద కొనసాగుతోంది.

Details

సెక్టార్ వారీగా స్టాక్స్‌ కదలికలు

నిఫ్టీ సూచీలో టెక్ మహీంద్రా, టీసీఎస్‌, ఎన్‌టీపీసీ, హీరో మోటార్‌కార్ప్‌, ట్రెంట్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. అయితే జియో ఫైనాన్షియల్, రిలయన్స్‌, మారుతీ సుజుకీ, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్‌, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌ షేర్లు నష్టాలను ఎదుర్కొంటున్నాయి. గత శుక్రవారం అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిసిన నేపథ్యంలో, నేటి ఆసియా మార్కెట్లు మిశ్రమ ధోరణిని ప్రదర్శిస్తున్నాయి. కనిష్ఠాల వద్ద కొనుగోళ్లకు మద్దతు లభించడం, అదనంగా ప్రధాని మోదీ చైనా పర్యటన కారణంగా సానుకూల భావన (positive sentiment) ఏర్పడటంతో దేశీయ సూచీలకు బలమిచ్చాయి.