
Stock Market: స్వల్ప లాభాలతో దేశీయ స్టాక్‌మార్కెట్లు ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ నేడు స్వల్ప లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. ఉదయం 9.19 గంటలకు నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 24,649 వద్ద, సెన్సెక్స్ 97 పాయింట్ల లాభంతో 80,637 వద్ద కొనసాగింది. ముత్తూట్ ఫినాన్స్, జేకే లక్ష్మీ సిమెంట్, టిమ్‌కెన్ ఇండియా, సీఐఈ ఆటోమోటివ్, కావేరీ సీడ్స్ షేర్లు గణనీయమైన లాభాల్లో ఉండగా, దీపక్ నైట్రైట్, సీఎస్‌బీ బ్యాంక్, సూర్య రోష్ని లిమిటెడ్ షేర్లు గణనీయంగా నష్టపోయాయి. మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపిన అంశాలలో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో ద్రవ్యోల్బణం 3.5 శాతంగా ఉండవచ్చన్న రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనాలు, టారిఫ్‌ల ప్రభావంతో జీడీపీ వృద్ధి రేటు తగ్గదన్న చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ నాగేశ్వరన్ ప్రకటన ముఖ్యమైనవి.
Details
మిశ్రమంగా కదులుతున్న ఆసియా-పసిఫిక్ మార్కెట్లు
ఈసారి ఆహార ఉత్పత్తుల దిగుబడి మెరుగ్గా ఉండే అవకాశం ఉండటంతో ద్రవ్యోల్బణం అదుపులోకి రావచ్చని క్రిసిల్ పేర్కొంది. అంతేకాక ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు తగ్గితే 2025-26లో బ్రెంట్ క్రూడ్ చమురు ధర బ్యారెల్‌కు 60-65 డాలర్ల మధ్య ఉండవచ్చని అంచనా వేసింది. ఫారెక్స్ ట్రేడింగ్‌లో రూపాయి నేడు స్వల్పంగా బలహీనపడింది. 3 పైసలు పడిపోగా, రూ.87.47 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు మిశ్రమంగా కదులుతున్నాయి. షాంఘై సూచీ 0.22% లాభం, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్ 200 సూచీ 0.58% లాభం సాధించగా, జపాన్ నిక్కీ 1.27%, దక్షిణ కొరియా కోస్పీ 0.32%, తైవాన్ సూచీ 0.55% నష్టపోయాయి.