Page Loader
Salary increase: 2025లో దేశీయ వేతనాలు 9.4శాతం పెరిగే అవకాశం
2025లో దేశీయ వేతనాలు 9.4శాతం పెరిగే అవకాశం

Salary increase: 2025లో దేశీయ వేతనాలు 9.4శాతం పెరిగే అవకాశం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 19, 2025
10:37 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈ ఏడాది దేశీయ పరిశ్రమల్లో ఉద్యోగుల సగటు వేతన పెంపు 9.4 శాతంగా ఉండే అవకాశం ఉందని హెచ్‌ఆర్‌ కన్సల్టింగ్‌ సంస్థ మెర్సెర్ అంచనా వేసింది. బలమైన ఆర్థికాభివృద్ధి, నైపుణ్యాలున్న ఉద్యోగులకు పెరుగుతున్న డిమాండ్ దీనికి కారణమని సంస్థ వివరించింది. గత అయిదేళ్లలో వేతనాలు స్థిరంగా పెరుగుతున్నాయి. 2020లో 8శాతం పెరిగాయంటే 2025లో ఈ పెంపు 9.4 శాతానికి చేరుకోవచ్చని టోటల్ రెమ్యూనరేషన్ సర్వేలో పేర్కొంది. ఈ సర్వేలో దేశంలోని 1550కి పైగా కంపెనీలు పాల్గొన్నాయి.

Details

ఆటోమోటివ్ రంగంలో 10శాతం పెరిగే అవకాశం

వాటిలో టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, కన్జూమర్ గూడ్స్, ఆర్థిక సేవలు, తయారీ, ఆటోమోటివ్, ఇంజినీరింగ్ రంగాల కంపెనీలు ఉన్నాయి. ఆటోమోటివ్ రంగంలో వేతనాల పెంపు అత్యధికంగా 10శాతం ఉండే అవకాశం ఉంది. ఇది 2020లో 8.8శాతం ఉండేది. విద్యుత్ వాహనాలు, భారత్‌లో తయారీ కార్యక్రమాలు ఈ పెంపునకు సహకరించాయి. తయారీ, ఇంజినీరింగ్ రంగాలలో వేతనాలు 8శాతం నుంచి 9.7శాతం వరకూ పెరుగుతాయని అంచనా. 2025లో ఉద్యోగుల సంఖ్య పెంచేందుకు 37% కంపెనీలు ప్రయత్నిస్తాయని తెలిపాయి.