Page Loader
Wagh bakri director:వాఘ్ బక్రీ టీ గ్రూప్ ED పరాగ్ దేశాయ్ కన్నుమూత
వాఘ్ బక్రీ టీ గ్రూప్ ED పరాగ్ దేశాయ్ కన్నుమూత

Wagh bakri director:వాఘ్ బక్రీ టీ గ్రూప్ ED పరాగ్ దేశాయ్ కన్నుమూత

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 23, 2023
01:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్(49)సోమవారం మరణించినట్లు కంపెనీ సోషల్ మీడియాలో ప్రకటించింది. ఆయనకు భార్య విదిషా, కుమార్తె పరిషా ఉన్నారు. తన నివాసానికి సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో గాయపడిన ఆయన ఆసుపత్రిలో చేరారు. అక్టోబర్ 15వ తేదీ ఉదయం ఇస్కాన్ అంబిలి రోడ్ సమీపంలో మార్నింగ్ వాక్ చేస్తుండగా దేశాయ్ పై వీధి కుక్కలు దాడి చేసినట్లు కొన్ని జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. దాడి తరువాత అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది, కుటుంబ సభ్యులను అపప్రమత్తం చేసి ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న సమయంలోనే బ్రెయిన్ హెమరేజ్‌కు గురై తుదిశ్వాస విడిచినట్లు అహ్మదాబాద్ మిర్రర్ నివేదించింది.

Details 

60 దేశాలకు టీ ఎగుమతి

దేశాయ్ న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్ విశ్వవిద్యాలయం నుండి MBA పట్టా పొందారు. 1995లో కంపెనీ విలువ రూ.100 కోట్ల కంటే తక్కువగా ఉన్నప్పుడు దేశాయ్ వ్యాపారంలో చేరారు. నేడు, వాఘ్ బక్రీ టీ గ్రూప్ రూ.2,000 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ను కలిగి ఉండడమే కాకుండా 50 మిలియన్ కిలోల టీ పంపిణీతో భారతదేశంలోని ప్రముఖ ప్యాకేజ్డ్ టీ కంపెనీలలో ఒకటిగా ఉంది. కంపెనీ 24 రాష్ట్రాలలో ఉంది. ఈ కంపెనీ టీ ని దాదాపు 60 దేశాలకు ఎగుమతి చేస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వాఘ్ బక్రీ టీ గ్రూప్ ED పరాగ్ దేశాయ్ కన్నుమూత