Elon Musk: ప్రపంచంలోనే మొదటి వ్యక్తిగా ఎలాన్ మస్క్ చరిత్ర.. 400 బిలియన్ డాలర్ల సంపదతో అత్యంత సంపన్నుడిగా రికార్డ్
అపర కుబేరుడు ఎలాన్ మస్క్ తన సంపాదనలో ఒక సరికొత్త రికార్డు సాధించాడు.తొలి సారిగా ఆయన సంపద 400 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రపంచంలోనే 400 బిలియన్ డాలర్ల సంపద కలిగిన మొదటి వ్యక్తిగా నిలిచారు.ఇప్పటి వరకు ఎవరూ ఈ రికార్డు సృష్టించలేదు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం,SpaceX కంపెనీ ఆంతర్గత వ్యాపార లావాదేవీల ద్వారా ఎలాన్ మస్క్ నికర విలువ 50 బిలియన్ డాలర్లు అకస్మాత్తుగా పెరిగింది,దీంతో ఆయన మొత్తం నికర విలువ 439 బిలియన్ డాలర్లకు పెరిగింది. డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల విజయాన్ని తరువాత,ఎలాన్ మస్క్ నికర విలువ 175 బిలియన్ డాలర్లు పెరిగింది. మరోవైపు,టెస్లా షేర్లు కూడా మంచి పెరుగుదల చూపిస్తున్నాయి.డిసెంబర్ 4 నుండి,టెస్లా షేర్లు 72 శాతం పెరిగాయి.
ట్రంప్ గెలిచిన తరువాత, ఎలాన్ మస్క్ సంపద మరింత పెరిగింది
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, బుధవారం, SpaceX తన పెట్టుబడిదారుల నుండి $1.25 బిలియన్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడానికి అంగీకరించింది, దీని వల్ల కంపెనీ విలువ 350 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ ఒప్పందంతో, SpaceX ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ స్టార్టప్‌గా మారింది. ఈ లావాదేవీ వల్ల ఎలాన్ మస్క్ యొక్క నికర విలువ 50 బిలియన్ డాలర్లు పెరిగి, 439.2బిలియన్ డాలర్లకు చేరుకుంది. డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తరువాత, ఎలాన్ మస్క్ సంపద మరింత పెరిగింది. నవంబర్ 5న ఎలాన్ మస్క్ నికర విలువ 264బిలియన్ డాలర్లు ఉండగా,ఇప్పుడు అది 439 బిలియన్ డాలర్లను దాటింది. ఈ వృద్ధితో, ఎలాన్ మస్క్ తన సంపదను తక్కువ సమయంలో 175బిలియన్ డాలర్లు పెంచుకున్నాడు.
73 శాతానికి పైగా పెరిగిన టెస్లా షేర్లు
2024 సంవత్సరంలో అతని సంపద 200 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, 2023 జూలై 1న ఎలాన్ మస్క్ నికర విలువ $126 బిలియన్లు ఉండగా, నేటికి అది 3.48 రెట్లు లేదా 248 శాతం పెరిగింది. మరోవైపు, టెస్లా షేర్లు మంచి పెరుగుదల చూపిస్తున్నాయి. తాజా ట్రేడింగ్ సెషన్లో, టెస్లా షేర్లు 4.50 శాతం పెరిగి, $420.40గా గరిష్ట స్థాయిని తాకాయి. అలాగే, నవంబర్ 4 నుండి టెస్లా షేర్లు 73 శాతానికి పైగా పెరిగాయి.