NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Starlink: స్టార్‌లింక్‌కు భారత్‌లో స్పెక్ట్రమ్ పన్ను 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Starlink: స్టార్‌లింక్‌కు భారత్‌లో స్పెక్ట్రమ్ పన్ను 
    స్టార్‌లింక్‌కు భారత్‌లో స్పెక్ట్రమ్ పన్ను

    Starlink: స్టార్‌లింక్‌కు భారత్‌లో స్పెక్ట్రమ్ పన్ను 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 18, 2025
    10:19 am

    ఈ వార్తాకథనం ఏంటి

    శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలందించేందుకు ప్రపంచంలోని ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్‌ మస్క్‌ స్పేస్‌-X (SpaceX) సంస్థతో భారతదేశపు అగ్రశ్రేణి టెలికాం కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.

    ఈ నేపథ్యంలో త్వరలో భారత్‌లో స్టార్‌లింక్‌ (Starlink) సేవలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    అయితే, కేంద్ర ప్రభుత్వం ఈ సేవలకు అనుమతులు ఇచ్చే విషయంలో కొన్ని కఠినమైన షరతులను విధించినట్లు ఇటీవల వార్తలు వెలువడ్డాయి.

    ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ 'పన్ను' సంబంధిత సవాళ్లను కూడా ఎదుర్కొంటోందని తెలుస్తోంది.

    వివరాలు 

     3% స్పెక్ట్రమ్‌ వినియోగ రుసుము

    భారతదేశంలో స్టార్‌లింక్‌ సేవలకు సంబంధించి స్పెక్ట్రమ్‌ పన్ను విధించే అవకాశముందని సమాచారం.

    విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ ప్రముఖ ఆంగ్ల వార్తా మాధ్యమం ఈ అంశాన్ని వెల్లడించింది.

    ఈ పన్ను విధించబడితే, శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ సేవల వ్యయం పెరిగే అవకాశం ఉంది.

    గతంలో, దేశీయ టెలికాం సంస్థలు రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌-ఐడియా మొదలైన కంపెనీలకు స్పెక్ట్రమ్‌ పన్నును తొలగించిన విషయం తెలిసిందే.

    దేశంలో స్టార్‌లింక్‌ సేవల ద్వారా కంపెనీకి లభించే సర్దుబాటు చేసిన స్థూల ఆదాయంపై (AGR) దాదాపు 3% స్పెక్ట్రమ్‌ వినియోగ రుసుమును విధించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు ఈ కథనాలు తెలియజేస్తున్నాయి.

    వివరాలు 

    స్పెక్ట్రమ్‌ వినియోగానికి అదనపు రుసుములు

    ''వేలానికి బదులుగా,శాటిలైట్‌ ఆపరేటర్లకు నేరుగా స్పెక్ట్రమ్‌ను కేటాయిస్తున్నందున ఈవినియోగ ఛార్జీలు వర్తించనున్నాయి.అంటే,టెలికాం కంపెనీలు చెల్లించే 8%లైసెన్సు ఫీజు మాత్రమే కాకుండా, శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ ఆపరేటర్లు స్పెక్ట్రమ్‌ వినియోగానికి అదనపు రుసుములు చెల్లించాల్సి ఉంటుంది.ఈరుసుము AGR పై 3%కంటే ఎక్కువగా ఉండొచ్చు.దీనికి సంబంధించిన తుది రేట్లపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి''అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

    ప్రస్తుతం ఈ వినియోగ రుసుములు,శాటిలైట్‌ స్పెక్ట్రమ్‌ కేటాయింపు కాలవ్యవధి వంటి అంశాలు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌(TRAI)వద్ద చర్చల దశలో ఉన్నాయి.

    ఈచర్చల అనంతరం,స్పెక్ట్రమ్‌ కేటాయింపుకు సంబంధించి ట్రాయ్‌ తన ప్రతిపాదనలను టెలికాం శాఖకు అందించనుంది.

    అక్కడినుంచి పరిశీలించిన తర్వాత ఈ ప్రతిపాదనలు డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌(DCCకి పంపబడతాయి.

    డీసీసీ అనుమతుల అనంతరం చివరగా కేబినెట్‌ ఆమోదించాల్సి ఉంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    Pakistan: భారతదేశంతో ఉద్రిక్తతల మధ్య.. ఆర్థిక సహాయం కోసం పంచ బ్యాంకు'ను సంప్రదించిన పాకిస్తాన్  పాకిస్థాన్
    Omar Abdullah: అత్యవసరంగా జమ్మూకు ఒమర్‌ అబ్దుల్లా.. పరిస్థితిని సమీక్షించనున్న సీఎం  ఒమర్ అబ్దుల్లా
    Dance of the Hillary Virus: అలర్ట్.. 'డాన్స్ ఆఫ్ ది హిల్లరీ' మాల్వేర్‌తో సైబర్ దాడికి పాక్ పన్నాగం! భారతదేశం
    PSL : ఉద్రిక్తతల ఎఫెక్టు.. పాక్ సూపర్ లీగ్‌ మ్యాచ్‌లు యూఏఈకి షిఫ్ట్ పాకిస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025