Page Loader
Elon Musk: మూడేళ్ల తర్వాత 300 బిలియన్‌ మార్క్ దాటిన ఎలాన్‌ మస్క్‌ సంపద
మూడేళ్ల తర్వాత 300 బిలియన్‌ మార్క్ దాటిన ఎలాన్‌ మస్క్‌ సంపద

Elon Musk: మూడేళ్ల తర్వాత 300 బిలియన్‌ మార్క్ దాటిన ఎలాన్‌ మస్క్‌ సంపద

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 09, 2024
01:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడానికి ఎలాన్ మస్క్ కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. దీంతో మస్క్ సంపద భారీగా పెరిగింది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. మస్క్ సంపద 300 బిలియన్ డాలర్ల మార్క్ దాటింది. ఇది మూడు సంవత్సరాల తర్వాత మళ్లీ పెరిగింది. మంగళవారం టెస్లా స్టాక్‌లో 28 శాతం పెరుగుదలతో, మస్క్ సంపదలో మరో 50 బిలియన్ డాలర్లు చేరాయి. మొత్తంగా 313.7 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు నివేదిక పేర్కొంది. 2022లో మస్క్ 340.4 బిలియన్ డాలర్లతో 300 బిలియన్ డాలర్లను దాటిన ఏకైక వ్యక్తిగా రికార్డుకెక్కాడు. ఇప్పుడు మళ్లీ ఆ స్థాయికి చేరుకున్నారు.

Details

ట్రంప్ కి మద్దతుగా విరాళాలిచ్చిన ఎలాన్ మస్క్

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 230 బిలియన్ డాలర్లతో, మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ 209 బిలియన్ డాలర్లతో తరువాతి స్థానాల్లో ఉన్నారు. ఇక ట్రంప్‌కి మద్దతుగా ఎలాన్ మస్క్‌ భారీ విరాళాలిచ్చారు. ట్రంప్ విజయం సాధించడంతో మస్క్‌కు కీలక భాద్యతలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.