Page Loader
ఈఎంఎస్‌ షేర్లకు భలే గిరాకీ.. ఒక్కో లాట్‌పై దాదాపుగా 5 వేల లాభం
ఒక్కో లాట్‌పై దాదాపుగా 5 వేల లాభం

ఈఎంఎస్‌ షేర్లకు భలే గిరాకీ.. ఒక్కో లాట్‌పై దాదాపుగా 5 వేల లాభం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 21, 2023
05:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత స్టాక్ మార్కెట్లు బీఎస్‌ఈ(BOMBAY STOCK EXCHANGE)లో ఈఎంఎస్‌ లిమిటెడ్‌ షేరు భారీగా లాభాల బాట పట్టింది. ఈ మేరకు ఏకంగా 33.43 శాతం లాభంతో దూసుకెళ్లింది. మంచినీరు, మురుగు నీరుకి సంబంధించిన మౌలిక వసతుల ప్రాజెక్టులను చేపట్టే ఈఎంఎస్‌ లిమిటెడ్‌ షేర్లు ఒక్కో లాట్‌పై దాదాపుగా 5 వేల లాభాన్ని ఆర్జించింది. తొలుత బీఎస్ఈలో రూ.211.55 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించిన షేర్లు, చివరకు రూ.281.55 వద్ద స్థిరీకరించాయి. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ(NATIONAL STOCK EXCHANGE)లో రూ.288.70 దగ్గర లిస్ట్ అయ్యింది. దీంతో 33.67 శాతం లాభాన్ని సంపాదించుకుంది. ఇష్యూ ధర రూ.211తో పోలిస్తే బీఎస్‌ఈలో కంపెనీ షేరు 33.43 శాతం లాభంతో రూ.288.70 దగ్గర ట్రేడింగ్‌ ప్రయాణాన్ని ప్రారంభించింది.

DETAILS

ఈఎంఎస్‌ షేర్లతో లాభాలే లాభాలు

మరోవైపు ట్రేడింగ్‌ ప్రారంభ సమయంలో కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ విలువ సుమారుగా రూ.1,522.10 కోట్లుగా ఉంది. ఈ నెల 8-12 తేదీల మధ్య జరిగిన EMS లిమిటెడ్‌ ఐపీఓతో మొత్తం రూ.321 కోట్లు సమీకరించడమే లక్ష్యంగా సంస్థ ముందుకుసాగుతోంది. ఐపీఓలో రూ.146.24 విలువ గల షేర్లు తాజాగా అందించారు.ఆఫర్‌ ఫర్‌ సేల్‌(OFS)'మేరకు మరో 82.24 లక్షల షేర్లు కంపెనీ చీఫ్ ప్రమోటర్‌, వ్యవస్థాపకులు రామ్‌వీర్‌ సింగ్‌ విక్రయించారు. 75.28 రెట్ల షేర్లకు ఐపీఓలో బిడ్లు దాఖలయ్యాయి. కనీసం 70 షేర్లు కలిపి (లాట్‌) కొనాలనే నియమం పెట్టారు. ఒక్కో షేరుపై గరిష్ఠ ధర రూ.211 వద్ద ఒక్కొక్కరు రూ.14,770 పెట్టుబడి పెట్టారు. 33.43 శాతం లాభంతో చూస్తే పెట్టుబడి విలువ రూ.19,708కి చేరుకుంది.