
స్టాక్ మార్కెట్‌లోకి ఫోన్‌పే.. సరికొత్త యాప్ లాంచ్ చేసిన డిజిటల్ పేమెంట్స్ సంస్థ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ ఫోన్-పే దిగ్గజం, సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్టాక్ మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఫోన్ -పే సరికొత్త యాప్‌ను లాంచ్ చేసింది.
ఫలితంగా ఫోన్-పే (PhonePe) స్టాక్ మార్కెట్ల బిజినెస్‌లోకి అడుగుపెట్టగలిగింది. ఇప్పటివరకు కేవలం యూపీఐ(UPI) లావాదేవీలకే పరిమితమైన సంస్థ ఇక నుంచి స్టాక్ ఎక్స్చేంజ్ రంగంలోనూ రాణించాలని నిర్ణయించింది.
ఇందుకోసం స్టాక్ మార్కెట్ మదుపరుల కోసం ఫోన్-పే ఫ్లాట్ ఫామ్ ప్రత్యేకంగా ఓ యాప్‌ను రూపొందించింది.
దీంతో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే మదుపరుల(ఇన్వెస్టర్లు)కు తాజా ఫ్లాట్ ఫామ్ ఉపకరిస్తుందని కంపెనీ ప్రకటించింది. షేర్ మార్కెట్ (Share Market)పేరిట తన సరికొత్త యాప్‌ను ప్రారంభించింది.
DETAILS
ఇటీవలే రుణాలు, బీమా, చెల్లింపులను తీసుకొచ్చాం : ఫోన్ పే సీఈఓ సమీర్ నిగమ్
స్టాక్ మార్కెట్ రంగంలోకి ప్రవేశించిన ఫోన్-పే స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ సహా ఈటీఎఫ్‌లు (ఎక్స్ఛేంజ్ ట్రేడెట్ ఫండ్స్) లాంటి సేవలను అందించనుంది.
ఇప్పటికే బీమా పాలసీలను అందించటంతో పాటూ మ్యూచువల్ ఫండ్స్‌లోనూ పెట్టుబడి పెట్టేందుకు ఫోన్‌పే యాప్ వినియోగదారులకు సహకరించనుంది.
నాలుగేళ్ల క్రితమే మ్యూచువల్ ఫండ్ రంగంలో అడుగుపెట్టామని చెప్పిన ఫోన్ పే సీఈఓ సమీర్ నిగమ్, ఇటీవలే రుణాలు, బీమా, చెల్లింపులను తీసుకొచ్చామని వెల్లడించారు.
అయితే తాజాగా స్టాక్ బ్రోకరేజ్ వ్యాపారంలోనూ తాము అడుగుపెట్టామని సమీర్ నిగమ్ స్పష్టం చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించిన ఫోన్ పే సంస్థ
Say hello to https://t.co/1WFfwFbglu!
— Share.Market (@SharedotMarket) August 30, 2023
Your journey to financial success, energized by tech-powered features.#sharedotmarket #sharemarket #investlikeapro #India pic.twitter.com/AxS21TcuvO