EPFO alert: యజమానులకు ఈపీఎఫ్‌వో కీలక సూచన.. అక్టోబర్ పీఎఫ్ చెల్లింపులకు నవంబర్ 15 చివరి గడువు
ఈ వార్తాకథనం ఏంటి
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) యజమానులకు కీలక సూచన చేసింది. 2026 అక్టోబర్ నెల వేతనాలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్ (ECR) దాఖలు చేయడంతో పాటు,ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) కంట్రిబ్యూషన్లను నవంబర్ 15, 2026లోగా చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు నవంబర్ 12న తన అధికారిక ఎక్స్ (గతంలో ట్విటర్) ఖాతా ద్వారా గుర్తుచేసింది. నిర్ణీత గడువులోగా రిటర్న్ దాఖలు చేసి, చెల్లింపులు పూర్తి చేయాలని యజమానులకు సూచించింది. దీనివల్ల ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో నగదు సకాలంలో జమ కావడంతో పాటు ఆలస్య చెల్లింపులపై విధించే అదనపు ఛార్జీలను నివారించవచ్చని తెలిపింది. ఈ అంశంపై మరిన్ని వివరాలు కావాలంటే ఈపీఎఫ్‌ఓ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఈపీఎఫ్‌వో చేసిన ట్వీట్
📢 नियोक्ता ध्यान दें!
— EPFO (@officialepfo) November 12, 2026
अक्टूबर 2026 वेतन माह का ECR और देय EPF अंशदान 15 नवंबर तक जमा करना सुनिश्चित करें।
समय पर अनुपालन से कर्मचारियों के खातों में अंशदान का समय पर क्रेडिट होगा और विलंब शुल्क से भी बचाव होगा।#EPFO #EPFOWithYou #HumHainNa #ECR pic.twitter.com/3IXT3jQJxt
వివరాలు
నవంబర్ 15 గడువు ఎందుకు ముఖ్యం?
ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్ (ECR) అనేది ప్రతి నెలా యజమానులు దాఖలు చేయాల్సిన ఎలక్ట్రానిక్ రిటర్న్.
దీని ద్వారా ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (PF) కంట్రిబ్యూషన్ల వివరాలను ఈపీఎఫ్‌వోకు సమర్పించాలి.
అలాగే సంబంధిత చెల్లింపుల వివరాలను కూడా నమోదు చేయాలి. ఈ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయడం ద్వారా ఈపీఎఫ్‌వో నిబంధనలను పాటించవచ్చు.
అందువల్ల రిటర్న్ దాఖలు చేసే ముందు ఉద్యోగుల వివరాలు, వ్యక్తిగత సమాచారం, వేతన వివరాలు, పీఎఫ్ కంట్రిబ్యూషన్ లెక్కలను యజమానులు సరిచూసుకోవాలి.
అలాగే నిర్ణీత గడువులోగా చెల్లింపులు విజయవంతంగా పూర్తయ్యాయో లేదో నిర్ధారించుకోవాలి.
వివరాలు
గడువులోగా పీఎఫ్ చెల్లింపులు పూర్తి చేయాలి
ఒకవేళ నవంబర్ 15లోగా రిటర్న్ దాఖలు చేయకపోయినా, పీఎఫ్ కంట్రిబ్యూషన్లు చెల్లించకపోయినా సంబంధిత ఈపీఎఫ్ నిబంధనల ప్రకారం వడ్డీ, నష్టపరిహారం వంటి అదనపు ఛార్జీలు విధించే అవకాశం ఉంటుంది.
చివరి నిమిషంలో రిటర్న్ దాఖలు చేయకుండా ముందుగానే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవడం మంచిది.
ఈపీఎఫ్‌వో పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు లేదా వివరాల ధ్రువీకరణలో ఇబ్బందులు ఎదురైతే వాటిని పరిష్కరించుకునేందుకు తగిన సమయం ఉంటుంది.
కాబట్టి యజమానులు అక్టోబర్ నెలకు సంబంధించిన ECR దాఖలు, పీఎఫ్ చెల్లింపులను నవంబర్ 15లోగా పూర్తి చేయాలి.
తద్వారా అర్హులైన ఉద్యోగుల పీఎఫ్ కంట్రిబ్యూషన్లు సకాలంలో వారి ఖాతాల్లో జమ కావడంతో పాటు చట్టపరమైన బాధ్యతలను కూడా నెరవేర్చినట్లవుతుంది.