Diwali Epfo :ఉద్యోగులకు కేంద్రం దీపావళి గిఫ్ట్.. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు వడ్డీ బదిలీ
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం దీపావళి పండుగ కానుక అందించింది. ఈ మేరకు 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వడ్డీని పీఎఫ్ (Provident Fund) ఖాతాదారుల అకౌంట్లలో జమ చేస్తోంది. ఈపాటికే పలువురు ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులు వడ్డీ మొత్తాన్ని అందుకున్నారు. ఈపీఎఫ్ అకౌంట్‌లో ఉన్న నిల్వలపై 8.15 శాతం మేర కేంద్రం వడ్డీ చెల్లిస్తోంది. ఖాతాలో వడ్డీ జమైందో లేదో తెలుసుకునేందుకు ఖాతాదారులు ఈపీఎఫ్‌ఓ వెబ్‌సైట్ గానీ ఉమాంగ్ యాప్ ద్వారా గానీ పాస్‌బుక్‌ను తెరిచి చూసుకోవచ్చని కేంద్రం తెలిపింది.
ఈపీఎఫ్‌ఓ బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలో తెలుసా
1. ముందుగా https://www.epfindia.gov.in/ site_en/For_Employees.php ఈపీఎఫ్‌ఓ పోర్టల్‌లో లాగిన్ కావాలి 2. తర్వాత హోమ్‌పేజీలో 'సర్వీస్' పై క్లిక్ చేసి, 'ఫర్ ఎంప్లాయిస్' ఆప్షన్‌ని సెలెక్ట్ చేయాలి. 3. ఇక్కడ'మెంబర్ పాస్‌బుక్' లింక్‌పై క్లిక్ చేస్తే మీకు మరో పేజీ ఓపెన్ అవుతుంది. 4. మీ UAN నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి అకౌంట్‌లోకి లాగిన్ అవ్వాలి 5. అనంతరం మీ ఖాతా వివరాలను నమోదు చేయాలి.ఇలా ఈపీఎఫ్‌ఓ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ఉమాంగ్ యాప్ ద్వారా ఎలాగంటే : 1.ఉమాంగ్ యాప్‌ను ఓపెన్ చేసి మీ మొబైల్ నంబర్‌తో లాగిన్ కావాలి. అందుకు ఓటీపీ లేదా Mpin ఉపయోగించాలి. 2. లాగిన్ తర్వాత ఈపీఎఫ్‌ని ఎంపిక చేసుకోవాలి
ఇలా ఈ-పాస్‌బుక్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
3. కాన్ వ్యూ పాస్‌బుక్‌పై క్లిక్ చేసి తర్వాత మీ UAN ఎంటర్ చేసి గెట్ ఓటీపీపై నొక్కాలి. అప్పుడు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి మీ ఈపీఎఫ్‌ఓ ఖాతా వివరాలను తెలుసుకోవచ్చు. మెంబర్ ఐడీని ఎంపిక చేసుకుని ఈ-పాస్‌బుక్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. SMS ద్వారా EPFO బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు : SMS ద్వారా ఈపీఎఫ్‌ఓ బ్యాలెన్స్‌ని చెక్ చేయాలంటే, మీరు మీ UANని ఉపయోగించి ఎస్‌ఎంఎస్ ద్వారా ఈపీఎఫ్‌ఓ బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోవాలి. ఖాతా బ్యాలెన్స్ వివరాలను తెలుసుకునేందుకు మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ నుంచి "EPFOHO UAN ENG"ని 7738299899కి పంపించాలి. దీంతో మీకు మీ ఈపీఎఫ్‌ఓ బ్యాలెన్స్ ఎంత ఉందో మీ మొబైల్ నెంబర్‌కే మెసేజ్ వచ్చేస్తుంది.