Page Loader
EPFO : కోట్లాది మంది వేతన జీవులకు షాక్‌.. తగ్గనున్న పీఎఫ్ వడ్డీ
EPFO : కోట్లాది మంది వేతన జీవులకు షాక్‌.. తగ్గనున్న పీఎఫ్ వడ్డీ

EPFO : కోట్లాది మంది వేతన జీవులకు షాక్‌.. తగ్గనున్న పీఎఫ్ వడ్డీ

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 18, 2023
10:50 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)లో డబ్బులు దాచుకునే ఉద్యోగులకు కేంద్రం షాక్ ఇచ్చింది. రానున్న రోజుల్లో పీఎఫ్‌పై వడ్డీ తగ్గే అవకాశం ఉంది. ఉద్యోగుల భవిష్యనిధిపై వడ్డీ రేట్లను మరోసారి పరిశీలించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. FY 2021-22లో ఈపీఎఫ్‌ఓ ​​మిగులు నిధులను అంచనా వేసినా నష్టాన్ని చవిచూసింది. రూ. 449.34 కోట్ల మిగులు ఉంటుందని భావించినప్పటికీ రూ. 197.72 కోట్ల లోటు ఏర్పడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పీఎఫ్‌పై ఇస్తున్న వడ్డీ రేట్లను పునఃపరిశీలించేందుకు కేంద్ర ఆర్థిక సమాయత్తమవుతోంది. ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వడ్డీ రేటును 8.15 శాతంగా ఈపీఎఫ్‌ఓ నిర్ణయించింది.

DETAILS

వడ్డీ రేట్లను మరోసారి సమీక్షించాలని భావిస్తున్న కేంద్ర ఆర్థిక శాఖ

నష్టాలను దృష్టిలో ఉంచుకుని, వడ్డీ రేట్లను మరోసారి సమీక్షించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పీఎఫ్‌పై వడ్డీ రేటు మార్కెట్‌తో పోల్చితే కాస్త ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పీఎఫ్‌పై అధిక వడ్డీ రేట్లను తగ్గించేందుకు ఆర్థిక శాఖ కసరత్తులు చేస్తోంది. ఈ సందర్భంగా మార్కెట్ రేట్లతో సమానంగా వడ్డీ రేట్లను ఉంచాల్సిన సమయం వచ్చిందని పేర్కొంది. చాలా పొదుపు పథకాల్లో పీఎఫ్‌పై చెల్లించే వడ్డీ కంటే తక్కువగానే ఉంది. ఫలితంగా పీఎఫ్ వడ్డీని 8 శాతం లోపే కట్టడి చేయాలని నిర్ణయం తీసుంది. కోట్ల మంది ఉద్యోగుల సామాజిక భద్రతకు ఈపీఎఫ్ఓనే అతిపెద్ద ఆధారం. ప్రస్తుతం పీఎఫ్ అకౌంట్ ఉన్న వారి సంఖ్య 6 కోట్లకుపైగా ఉండటం కొసమెరుపు.