Page Loader
EPFO: ప్రత్యక్ష లావాదేవీల కోసం మరో 15 బ్యాంకులతో ఈపీఎఫ్‌ఓ భాగస్వామ్యం 
ప్రత్యక్ష లావాదేవీల కోసం మరో 15 బ్యాంకులతో ఈపీఎఫ్‌ఓ భాగస్వామ్యం

EPFO: ప్రత్యక్ష లావాదేవీల కోసం మరో 15 బ్యాంకులతో ఈపీఎఫ్‌ఓ భాగస్వామ్యం 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 02, 2025
08:55 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) తన బ్యాంకింగ్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించి, అదనంగా 15 బ్యాంకులను చేర్చినట్లు మంగళవారం ప్రకటించింది. ఈ కొత్త చేర్పులతో, ఈపీఎఫ్‌ఓతో ఒప్పందం కుదుర్చుకున్న బ్యాంకుల సంఖ్య 32కి పెరిగింది. ఈ ఒప్పందాలు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సమక్షంలో కుదిరాయి. కొత్తగా చేరిన 15 ప్రభుత్వ/ప్రైవేట్ బ్యాంకుల సహాయంతో సంవత్సరానికి రూ.12,000 కోట్ల నిధులను సులభంగా సేకరించేందుకు వీలైంది. ఈ బ్యాంకుల్లో ఖాతాలున్న యాజమాన్యాలకు నేరుగా ఈపీఎఫ్‌ఓకు చెల్లింపులు చేసేందుకు మరింత సౌలభ్యం లభించనుంది.

వివరాలు 

కొత్తగా చేర్చిన బ్యాంకులు

ఈ సందర్భంగా మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, 2024-25లో ఈపీఎఫ్‌ఓ 6 కోట్ల క్లెయిమ్‌లను పరిష్కరించి రికార్డు సృష్టించిందని తెలిపారు. గత ఏడాది పరిష్కరించిన 4.45 కోట్ల క్లెయిమ్‌లతో పోలిస్తే, ఇది 35% అధికమని పేర్కొన్నారు. కేంద్రీకృత పింఛను చెల్లింపు విధానం ప్రవేశపెట్టడంతో, దేశవ్యాప్తంగా 78 లక్షల మంది పింఛనుదారులు ఏ బ్యాంకు ఖాతాలోనైనా తమ పెన్షన్‌ను పొందగలరని వివరించారు. 2024-25లో మార్చి 20 నాటికి, ఈపీఎఫ్‌ఓ మొత్తం రూ.3.41 లక్షల కోట్ల సభ్యుల చందాలను సేకరించినట్లు వెల్లడించారు. హెచ్‌ఎస్‌బీసీ, స్టాండర్డ్ చార్టర్డ్, ఫెడరల్,ఇండస్‌ఇండ్, కరూర్ వైశ్య,ఆర్‌బీఎల్, సౌత్ ఇండియన్, సిటీ యూనియన్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్, యూకో, కర్ణాటక, డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్, తమిళనాడు మర్కంటైల్, డెవలప్‌మెంట్ క్రెడిట్, బంధన్ బ్యాంకులు.