LOADING...
Aadhaar free update: ఆధార్‌ అప్‌డేట్‌కి గడువు పొడిగింపు.. వచ్చే ఏడాది జూన్ 14 వరకు అవకాశం
ఆధార్‌ అప్‌డేట్‌కి గడువు పొడిగింపు.. వచ్చే ఏడాది జూన్ 14 వరకు అవకాశం

Aadhaar free update: ఆధార్‌ అప్‌డేట్‌కి గడువు పొడిగింపు.. వచ్చే ఏడాది జూన్ 14 వరకు అవకాశం

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 14, 2024
12:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో ఆధార్‌ కార్డ్ వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకోవడానికి కేంద్రం ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. దీనిపై భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ కీలక ప్రకటన చేసింది. ఈ గడువును మరో ఆరు నెలలు పెంచుతూ, 2025 జూన్‌ 14వరకూ ఈ అవకాశాన్ని అందుబాటులో ఉంచింది. దీంతో ఆధార్‌ కార్డులో చిరునామా మార్పులు చేయాలనుకుంటున్న వారు ఇప్పటి నుంచే ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. యూఐడీఏఐ నియమాల ప్రకారం, ప్రతి పదేళ్లకోసారి ఆధార్‌ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలి. ఇందులో పేరు, పుట్టిన తేదీ, చిరునామా తదితర మార్పులు చేయవచ్చు. ఈ సేవలు 'మై ఆధార్‌' పోర్టల్ ద్వారా ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఆధార్‌ కేంద్రాల్లో రూ. 50 చెల్లించి అప్‌డేట్‌ చేసుకోవాలి.

Details

 ఆన్‌లైన్‌లో ఆధార్‌ వివరాలను సులభంగా అప్‌డేట్‌ చేయడం ఎలా?

1. యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆధార్‌ నంబర్‌తో లాగిన్‌ అవ్వండి. 2. రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబరుకు ఓటీపీ పంపించి లాగిన్‌ అయిన తరువాత, మీ ఆధార్‌ వివరాలు స్క్రీన్‌పై ప్రదర్శితమవుతాయి. 3. ఈ వివరాలు సరైనవో కాదో పరిశీలించి, అవసరమైతే సవరణలు చేసుకోండి. లేదా మీరు ఉన్న వివరాలను వెరిఫై చేసి 'నెక్ట్స్‌' క్లిక్‌ చేయండి. 4. తరువాత కనిపించే డ్రాప్‌డౌన్‌ లిస్ట్‌ ద్వారా సంబంధిత డాక్యుమెంట్లను ఎంచుకోండి. 5. ఆ డాక్యుమెంట్ల స్కాన్డ్‌ కాపీలను అప్‌లోడ్‌ చేసి, 'సబ్మిట్‌' బటన్‌పై క్లిక్‌ చేయండి. 6. 14 అంకెల 'అప్‌డేట్‌ రిక్వెస్ట్‌ నంబర్‌' అందుతుంది, దీని ద్వారా అప్‌డేట్‌ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవచ్చు.