
FD rates: ఆర్‌బీఐ ఎంపీసీ భేటీ వేళ.. ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లలో ప్రముఖ బ్యాంకుల కోత
ఈ వార్తాకథనం ఏంటి
గత కొన్ని నెలలుగా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ల (Fixed Deposits - FD) పై ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్నప్పటికీ, ప్రస్తుతం రేట్లు తగ్గించడం ప్రారంభించాయి.
ప్రముఖ బ్యాంకులు ఇప్పటికే వడ్డీ రేట్లను సవరించాయి.
ప్రైవేట్ రంగంలో ప్రముఖమైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజా వడ్డీ మార్పులను ఏప్రిల్ 1 నుంచి అమలు చేయగా, ప్రభుత్వ రంగంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ప్రత్యేక FD స్కీమ్ "అమృత్ కలశ్" ను మార్చి 31తో నిలిపివేసింది.
ఈ డిపాజిట్ స్కీమ్ 2023 ఏప్రిల్‌లో 400 రోజుల కాలపరిమితితో ప్రారంభించబడింది.
వివరాలు
ఆర్‌బీఐ వడ్డీ నిర్ణయం.. బ్యాంకుల మార్పులు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మానిటరీ పాలసీ కమిటీ సమావేశం ఏప్రిల్ 7 నుండి 9 వరకు జరుగనుంది.
గత రెండు నెలల క్రితం జరిగిన ఎంపీసీ (MPC) సమావేశంలో 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు తగ్గించబడిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం దేశీయ ఆర్థిక వృద్ధికి ఊతం ఇవ్వడం లక్ష్యంగా మరోసారి రెపో రేటు తగ్గించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రైవేట్ రంగ బ్యాంకులైన హెచ్‌డీఎఫ్‌సీ, యెస్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, బంధన్ బ్యాంక్‌లు ఎఫ్‌డీ వడ్డీ రేట్లలో మార్పులు చేశాయి.
వివరాలు
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వడ్డీ మార్పులు
బ్యాంక్ 35 నెలల ఎఫ్‌డీ పై 35 బేసిస్ పాయింట్లు, 55 నెలల ఎఫ్‌డీ పై 40 బేసిస్ పాయింట్లు తగ్గించింది. రూ. 3 కోట్లలోపు రిటైల్ డిపాజిట్లకు గరిష్ఠంగా 7% వడ్డీ అందించనుంది. సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్లు వర్తించనున్నాయి. 21 నెలల FD పై 7.25% వడ్డీ కొనసాగుతుంది.
యెస్ బ్యాంక్ వడ్డీ మార్పులు
కొన్ని ఎంపిక చేసిన FDలపై 0.25% వడ్డీ తగ్గింపు జరిగింది. 12 నుంచి 24 నెలల FDలపై ఇంతకుముందు 8% వడ్డీ అందించగా, ఇకపై 7.75% మాత్రమే లభిస్తుంది.
వివరాలు
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ మార్పులు
బ్యాంక్ కొన్ని ప్రత్యేక FDల వడ్డీ రేట్లను తగ్గిస్తూ, గడువును జూన్ 30 వరకు పొడిగించింది. 333 & 555 రోజుల FDలు రద్దు అయ్యాయి.
444 రోజుల FD పై వడ్డీ 7.30% నుంచి 7.10% కు తగ్గింపు.777 రోజుల FDపై 0.75% తగ్గించి 6.50% చేశారు. 999 రోజుల FDపై 30 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.35% కు పరిమితం చేశారు.
బంధన్ బ్యాంక్ మార్పులు
రూ. 3 కోట్లకు పైబడి ఉన్న FD డిపాజిట్లపై ఏప్రిల్ 3 నుంచి వడ్డీ తగ్గింపు అమలు చేసింది. ఈ మార్పుల ప్రభావం బ్యాంకింగ్ వినియోగదారులపై ఉండనుంది.
ఆర్‌బీఐ భవిష్యత్తు వడ్డీ విధానం,బ్యాంకుల FD వ్యూహాలను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉంది.