Zomato: 15 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ.. జొమాటో రీ ఎంట్రీ
ఈ వార్తాకథనం ఏంటి
జొమాటో 15 నిమిషాల క్విక్ డెలివరీ సేవలను తిరిగి ప్రారంభించింది. ఫుడ్ డెలివరీ రంగంలో పోటీని మరింత పెంచేందుకు జొమాటో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ సేవలు ఇప్పటికే ముంబయి, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
జొమాటో యాప్‌లో "15 నిమిషాల డెలివరీ" ట్యాబ్ కనిపిస్తూ, వేగంగా తయారు చేసే రెసిపీలు, రెడీ-టు-ఈట్ వంటకాలు అందిస్తున్నాయి.
ఈ సేవ కోసం 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్న రెస్టారెంట్లను మాత్రమే ఎంపిక చేసినట్లు సమాచారం.
Details
దేశవ్యాప్తంగా అందించేందుకు సిద్ధం
గతంలో జొమాటో 10 నిమిషాల ఫుడ్ డెలివరీని ప్రారంభించి, కొన్ని కారణాల వల్ల ఆ సేవలను నిలిపింది.
అయితే ఇప్పుడు, స్విగ్గీ 10 నిమిషాల ఫుడ్ డెలివరీ సేవ 'బోల్ట్'ను 2024 అక్టోబర్‌లో ప్రారంభించి, వేగంగా విస్తరించడం ప్రారంభించింది.
తాజాగా ఓలా కూడా 10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ సేవలను దేశవ్యాప్తంగా అందించేందుకు సిద్ధమవుతుంది.
ఈ నేపథ్యంలో జొమాటో 15 నిమిషాల్లో డెలివరీ ఇచ్చేలా రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.
Details
స్విగ్గీ కొత్త యాప్.. 15 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు మధ్య జోరుగా సాగుతున్న పోటీలో,వినియోగదారులను ఆకట్టుకునే రకరకాల ఆలోచనలతో కంపెనీలు కొత్త సేవలను పరిచయం చేస్తున్నాయి.
తాజాగా, ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కొత్త సేవలతో ముందుకు వచ్చింది.SNACC పేరిట ఒక కొత్త యాప్‌ను పరిచయం చేసింది.
ఈ యాప్ ఎలా పనిచేస్తుంది?వినియోగదారులు ఏ విధంగా సేవలను పొందగలరు?అన్నవిషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
SNACC యాప్ ద్వారా క్విక్ బైట్స్,బేవరేజెస్,ఫుడ్ డెలివరీ సేవలు అందుబాటులో ఉంటాయి.
ప్రత్యేకంగా,కేవలం 15నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ చేసే సదుపాయం ఇందులో ప్రవేశపెట్టబడింది.
ప్రస్తుతం,ఈ సేవలు బెంగళూరులో అందుబాటులో ఉన్నాయి.స్విగ్గీ ఈ యాప్‌ను క్విక్ కామర్స్ సేవల భాగంగా తీసుకొచ్చినట్లు ప్రకటించింది.
త్వరలోనే ఈ సేవలు ఇతర నగరాలలో కూడా అందుబాటులోకి రానున్నాయి.