'వోడాఫోన్ ఐడియా' యూజర్స్ కోసం స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో మూడో అతిపెద్ద టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా (Vi) 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వేళ వినియోగదారుల కోసం కొత్త ఆఫర్లను ప్రకటించింది.
టెల్కో ఆఫర్ కింద ఎంపిక చేసిన ప్రీపెయిడ్ ప్లాన్‌లపై వినియోగదారులకు తగ్గింపులను అందిస్తోంది. అంతేకాదు బోనస్ డేటాను కూడా అందిస్తోంది.
ప్రీపెయిడ్ కస్టమర్‌లకు ఆఫర్ కొద్ది కాలం మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది.
ఇండిపెండెన్స్ డే ఆఫర్‌లు ఆగస్టు 12 నుంచి ఆగస్టు 18 వరకు మాత్రమే కస్టమర్‌లకు అందుబాటులో ఉంటాయని వొడాఫోన్ ఐడియా తెలిపింది.
కొత్త ఆఫర్ ప్రకారం, ఆగస్టు 12నుంచి 18మధ్య, వినియోగదారులు రూ. 199కంటే ఎక్కువ రీఛార్జ్ ప్లాన్‌లపై 50GB వరకు అదనపు డేటాను పొందవచ్చని వోడాఫోన్-ఐడియా తెలిపింది.
ఐడియా
వోడాఫోన్-ఐడియా ఆఫర్స్ ఇలా ఉన్నాయి
ప్రీపెయిడ్ ప్లాన్లలో రూ. 1449రీచార్జ్ పై రూ.50, రూ. 3099 రీచార్జ్‌పై డిస్కౌంట్ లభిస్తుందని వోడాఫోన్-ఐడియా వెల్లడించింది.
ఈ రీచార్జ్ ప్లాన్‌లపై 2GB అదనపు డేటాతో పాటు SonyLivకి ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందవచ్చు.
Viవినియోగదారులకు రూ. 299రీఛార్జ్ ప్లాన్‌లో 28రోజుల పాటు రోజువారీ 1.5GB డేటా, 100ఎస్ఎంఎస్‌లతో అపరిమిత కాల్‌ను పొందవచ్చు.
రూ.319 ప్లాన్‌తో 2GB రోజువారీ డేటాతో పాటు 100ఎస్ఎంఎస్‌లు, అపరిమిత కాల్స్, ఇతర ప్రయోజనాలను అందిస్తుంది.
రూ.359 రీఛార్జ్‌తో రోజుకు 3GB డేటా, 100ఎస్ఎంఎస్‌లు, 28 రోజుల చెల్లుబాటుతో అపరిమిత కాల్స్ పొందవచ్చు.