
IMF: ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉర్జిత్ పటేల్
ఈ వార్తాకథనం ఏంటి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ డాక్టర్ ఉర్జిత్ పటేల్ అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ED)గా ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవిలో మూడు సంవత్సరాల పాటు కొనసాగనున్నారు. కెన్యా దేశంలో జన్మించిన భారతీయ ఆర్థిక నిపుణుడు ఉర్జిత్ పటేల్, మూడు దశాబ్దాల క్రితం ప్రారంభించిన వృత్తిని మాతృ సంస్థలో తిరిగి కొనసాగిస్తున్నారు. ఆయన IMFలో ఐదేళ్లుగా వివిధ హోదాల్లో పని చేశారు.మొదట ఆయన వాషింగ్టన్ డీసీలో విధులు నిర్వర్తించిన తరువాత,1992లో న్యూఢిల్లీలో ఐఎంఎఫ్ డిప్యూటీ రెసిడెంట్ రిప్రెజెంటేటివ్‌గా భారత్‌కు వచ్చారు.
వివరాలు
ఆర్‌బీఐ గవర్నర్‌గా పనిచేసిన ఉర్జిత్ పటేల్
ఇప్పటికే IMFలో భారతదేశం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న కృష్ణమూర్తి వి. సుబ్రమణియం సేవలను ఏప్రిల్ 30న ఆరు నెలల ముందుగా రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ఉర్జిత్ పటేల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. 2016 నుంచి 2018 మధ్య కాలంలో ఉర్జిత్ పటేల్ ఆర్‌బీఐ గవర్నర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉర్జిత్ పటేల్
Former #RBI Governor #UrjitPatel appointed as India’s Executive Director at IMF for 3 years.@shivanibazaz @anshul91_m with detailshttps://t.co/RISTVyeTU5
— CNBC-TV18 (@CNBCTV18News) August 29, 2025