Youtube Former CEO Died : క్యాన్సర్‌తో యూట్యూబ్ మాజీ సీఈవో డయాన్ వోజ్‌కికీ మృతి
యూట్యూబ్ మాజీ సీఈవో సుసాన్ డయాన్ వోజ్‌కికీ(56) క్యాన్సర్‌తో కన్నుమూశారు. రెండు సంవత్సరాలుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె ఇవాళ మృతి చెందినట్లు ఆమె భర్త డెన్నిస్ ట్రాపర్ వెల్లడించారు. యూఎస్‌కు చెందిన సుసాన్ 2014 నుండి 2023 వరకు యూట్యూబ్ సీఈవోగా పనిచేసిన విషయం తెలిసిందే. ఆమె మృతిపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తీవ్ర దిగ్రాంతి వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాలు క్యాన్సర్‌తో పోరాడిన నా స్నేహితురాలు మరణించడం నమ్మశక్యంగా లేదని పేర్కొన్నారు. ఆమె లేని ప్రపంచాన్ని ఊహించడం కష్టమన్నారు.
మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లడం బాధాకరం : డెన్నిస్ ట్రాపర్
సుసాన్ వోజ్కికీ భర్త డెన్నిస్ ట్రాపర్ ఫేస్‌బుక్ పోస్ట్‌తో ఆమె మరణ వార్తను తెలియజేశారు. సుసాన్ వోజ్కికీ మరణం తనను ఎంతో బాధిస్తోందని, ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో 2 సంవత్సరాలు జీవించిన తర్వాత ఈ రోజు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిందన్నారు. సుసాన్ జీవిత భాగస్వామి మాత్రమే కాదని, ప్రియమైన స్నేహితురాలని పేర్కొన్నారు. ఆమె మరణం నుంచి తమ కుటుంబం ఇప్పుడే కోలుకోలేదన్నారు.