PM Surya Ghar: బడ్జెట్లో నిధులే నిధులు.. కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సామన్య, మధ్య తరగతి ప్రజల కోసం వరాల జల్లు కురిపించారు. ముఖ్యంగా ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన్ కింద కోటీ ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నట్లు ప్రకటించారు. రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసి, ప్రతి నెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
సౌర విద్యుత్ కోసం 1.28 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు
ఇప్పటికే ఈ పథకం కింద 1.28 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు చేసుకున్న విషయం తెలిసిందే. సౌర విద్యుత్‌ను వినియోగంతో ఆర్థిక ఉపశమనం కలుగుతుందన్నారు. దీని వల్ల ప్రతి ఇంటికి రూ.15,000 నుండి రూ.18,000 వరకు వార్షిక పొదుపును పొందే అవకాశం ఉంటుంది. పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ పథకంతో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్‌ను సులభతరం చేయోచ్చు. వచ్చే ఐదేళ్లలో 40GW సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.