LOADING...
Gameskraft layoffs: రియల్ మనీ గేమింగ్ నిషేధం ప్రభావం..  గేమ్స్‌క్రాఫ్ట్‌లో ఉద్యోగుల తొలగింపు 
రియల్ మనీ గేమింగ్ నిషేధం ప్రభావం.. గేమ్స్‌క్రాఫ్ట్‌లో ఉద్యోగుల తొలగింపు

Gameskraft layoffs: రియల్ మనీ గేమింగ్ నిషేధం ప్రభావం..  గేమ్స్‌క్రాఫ్ట్‌లో ఉద్యోగుల తొలగింపు 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 18, 2025
03:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆన్‌లైన్ గేమింగ్ రంగంలో ప్రసిద్ధి పొందిన గేమ్స్‌క్రాఫ్ట్ కంపెనీ తాజాగా పెద్ద నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం రియల్ మనీ గేమింగ్‌పై నిషేధం విధించే బిల్లును ప్రవేశపెట్టడంతో, ఈ రంగం మొత్తం తీవ్రమైన సంక్షోభంలో పడింది. దాంతో సంస్థ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయని గేమ్స్‌క్రాఫ్ట్ స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో సంస్థకు తప్పనిసరిగా పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ చేపట్టాల్సి వచ్చిందని తెలిపింది. అందులో భాగంగా కంపెనీలో పనిచేస్తున్న 120 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకాల్సిన పరిస్థితి ఏర్పడిందని వెల్లడించింది.

వివరాలు 

మార్చి 2026 వరకు ఆరోగ్య బీమా సౌకర్యం 

తమ నియంత్రణలో లేని పరిస్థితుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సంస్థ వివరించింది. భవిష్యత్తులో మరిన్ని ఆర్గనైజేషనల్ చేంజెస్ (వ్యవస్థీకృత మార్పులు)చేయాల్సిన అవసరం ఉందని కూడా గేమ్స్‌క్రాఫ్ట్ సూచించింది. తొలగించబడిన ఉద్యోగుల విషయంలో సంస్థ కొన్ని భరోసాలు ఇచ్చింది. ఒప్పందం ప్రకారం వారికి అన్ని చెల్లింపులు సమయానికి చేస్తామని తెలిపింది. అంతేకాక, రాబోయే మార్చి 2026 వరకు ఆరోగ్య బీమా సౌకర్యం కొనసాగుతుందని హామీ ఇచ్చింది. ఉద్యోగులు ప్రస్తుతం పొందుతున్న గ్రూప్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను వ్యక్తిగత పాలసీగా మార్చుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నట్లు పేర్కొంది. గమనించదగ్గ విషయం ఏమిటంటే, గేమ్స్‌క్రాఫ్ట్ మాత్రమే కాకుండా రియల్ మనీ గేమింగ్ రంగంలో పనిచేస్తున్న మరికొన్ని కంపెనీలు కూడా ఇలాంటి ఉద్యోగుల తొలగింపులు చేపట్టినట్లు సమాచారం.