Page Loader
ప్రపంచంలోని సంపన్నుల జాబితాలో టాప్ 29 స్థానానికి పడిపోయిన గౌతమ్ అదానీ
సంపన్నుల లిస్ట్ టాప్ 29 స్థానానికి పడిపోయిన గౌతమ్ అదానీ

ప్రపంచంలోని సంపన్నుల జాబితాలో టాప్ 29 స్థానానికి పడిపోయిన గౌతమ్ అదానీ

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 23, 2023
04:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫోర్బ్స్ బ్లూమ్‌బెర్గ్ సూచీల ప్రకారం, గౌతమ్ అదానీ వ్యాపార దిగ్గజం సంపద బుధవారం $44 బిలియన్ల దిగువకు పడిపోయింది. అమెరికన్ షార్ట్-సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్ గురించి నివేదికను ప్రచురించినప్పటి నుండి అదానీ సంపదలో తగ్గుదల కనిపిస్తుంది. హిండెన్‌బర్గ్ జనవరిలో అదానీ గ్రూప్‌పై గ్రూప్ మార్కెట్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసానికి పాల్పడిందని నివేదికను ప్రచురించింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ఈ సంవత్సరం ప్రారంభంలో అదానీ విలువ $121 బిలియన్లు. అప్పుడు జాబితాలో అదానీ మూడవ స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు, $42.7 బిలియన్ల సంపదతో 29వ స్థానానికి పడిపోయాడు. ఫోర్బ్స్ ప్రకారం, అదానీ గ్రూప్ చైర్మన్ ప్రస్తుతం 43.4 బిలియన్ డాలర్లతో 26వ స్థానంలో ఉన్నారు.

అదానీ

నివేదిక తరవాత అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు రోజురోజుకు పతనమవుతున్నాయి

అదానీ ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రపంచంలో రెండవ అత్యంత సంపన్న భారతీయుడిగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కంటే వెనుకంజలో ఉన్నాడు. బ్లూమ్‌బెర్గ్ ఇండెక్స్ ప్రకారం, అంబానీ నికర విలువ $81.5 బిలియన్లతో ప్రపంచంలో 12వ ధనవంతుడు. మరోవైపు ఫోర్బ్స్ లో 8వ స్థానంలో ఉన్నాడు. హిండెన్‌బర్గ్ తన నివేదికను ప్రచురించినప్పటి నుండి అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు రోజురోజుకు పతనమవుతున్నాయి. గ్రూప్ ప్రధాన సంస్థ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం-క్యాప్) జనవరి 7న $52.81 బిలియన్ల నుండి $20.46 బిలియన్లకు పడిపోయింది. జనవరి 24 నాటి $232 బిలియన్లతో పోలిస్తే ఇప్పుడు $100 బిలియన్ కంటే తక్కువగా ఉంది.