
Godrej Family - Split After 127 Years:127 ఏళ్ల తర్వాత విడిపోతున్నగోద్రెజ్ కుటుంబం..ఎవరెవరికి ఏమేమిటి?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ గృహోపకరణాలు, సబ్బులు, ఫర్నీచర్ ఉత్పత్తులతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలోకి కూడా ప్రవేశించిన సంస్థ గోద్రెజ్(Godrej)రెండుగా చీలిపోనుంది.
గోద్రెజ్ ను స్థాపించిన 127 ఏళ్ల తర్వాత ఈ సంస్థ విడిపోతుండటంతో ఎవరెవరికి ఏమేమిటి అనే అంశాలు సహజంగానే తెరపైకి వస్తున్నాయి.
సంస్థ వ్యవస్థాపక సభ్యులు గా ఉన్న ఆది గోద్రెజ్ (Adi Godrej) (82), అతని సోదరుడు నాదిర్(Nadir)(73), జంషీద్ గోద్రెజ్(Jamshed Godrej)(75), స్మితా గోద్రెజ్ కృష్ణ(Smitha Godrej Krishna)(74)లు రెండు వర్గాలుగా చీలిపోయారు.
ఇందులో ఆది గోద్రెజ్, అతని సోదరుడు నాదిర్ ఒకవైపు ఉండగా వారి దాయాదులు, బంధువులు జంషీద్ గోద్రెజ్, స్మితా గోద్రెజ్ కృష్ణ మరోవైపు ఉన్నారు.
Godrej Family - Split
వారికి ఇవి...వీరికి అవి
చీలిపోయిన ఈరెండు వర్గాలకు ఆస్తి పంపకాల్లో గోద్రెజ్ కు చెందిన ఐదు సంస్థలు ఆది గోద్రెజ్, నాదిర్ లకు దక్కాయి.
జంషీద్, స్మితాలు అన్‌లిస్టెడ్ గోద్రెజ్ & బోయ్స్ దాని అనుబంధ సంస్థలతో పాటు ముంబైలోని ప్రధాన ఆస్తితో సహా ల్యాండ్ బ్యాంక్‌ను దక్కించుకున్నాయి.
గోద్రెజ్ ఏరోస్పేస్, ఏవియేషన్‌లో రక్షణ, ఫర్నిచర్, ఐటీ సాఫ్ట్వేర్ వరకు విస్తరించింది.
వీటికి జంషీద్ గోద్రెజ్ చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు.
ఆయన సోదరి స్మిత కుమార్తె నైరికా హోల్కర్ (42) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తారు.
గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్, లిస్టెడ్ కంపెనీలు, గోద్రెజ్ ఇండస్ట్రీస్, గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, గోద్రెజ్ ప్రాపర్టీస్, గోద్రెజ్ అగ్రోవెట్, అస్టెక్ లైఫ్‌సైన్సెస్ లకు నాదిర్ గోద్రెజ్ చైర్‌పర్సన్‌గా ఉంటారు.