
Gold Price : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గుతున్న బంగారం ధరలు.. తులం ధర ఎంతంటే..
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం ధరలు స్వల్పంగా తగ్గినప్పటికీ,ఇంకా అది ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలోనే కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక తులం బంగారం కొనుగోలు చేయాలంటే దాదాపు లక్ష రూపాయల వరకు ఖర్చవుతోంది. ఇటీవల ధర కొద్దిగా తగ్గిన,బంగారం ధరలు ఇప్పటికీ అత్యంత అధికంగానే ఉన్నాయి. జూలై 28వ తేదీ నాటికి దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,920గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.91,590 వద్ద ఉంది. ఇక వెండి విషయానికి వస్తే, దీని ధర కూడా కాస్త తగ్గిందని తెలుస్తోంది. ప్రస్తుతం కిలో వెండి ధర సుమారుగా రూ.1,15,900 వద్ద కొనసాగుతోంది. అయితే, కొంతమంది ప్రాంతాల్లో వెండి ధర రూ.1,25,900 వరకు ఉన్నట్లు సమాచారం.
వివరాలు
ప్రధాన నగరాల్లో బంగారం ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
చెన్నై: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,920, 22 క్యారెట్ల ధర రూ.91,590 హైదరాబాద్: 24 క్యారెట్ల ధర రూ.99,920, 22 క్యారెట్ల ధర రూ.91,590 విజయవాడ: 24 క్యారెట్ల ధర రూ.99,920, 22 క్యారెట్ల ధర రూ.91,590 బెంగళూరు: 24 క్యారెట్ల ధర రూ.99,920, 22 క్యారెట్ల ధర రూ.91,590
వివరాలు
అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి..
ఇంత అధిక ధరల మధ్య బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారు మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బంగారానికి సంబంధించిన నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీపడకూడదని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత ధరల స్థితిలో స్వల్ప తేడా వచ్చినా వినియోగదారులకు భారీ ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి వల్ల బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాల్లో ఒకటిగా భావిస్తున్నారు.