
Gold Price : మహిళలకు గుడ్ న్యూస్ .. భారీగా దిగొచ్చిన ధరలు.. తులం ఎంతంటే.?
ఈ వార్తాకథనం ఏంటి
ఇంట్లో పెళ్లి, శుభకార్యం లేదా పండుగల సమయంలో మహిళలు తప్పనిసరిగా బంగారం కొనుగోలు చేసే సంప్రదాయం ఉంది. అయితే, ఇటీవలి కాలంలో బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తున్నాయి, తగ్గే లక్షణాలు కనిపించలేదు. ఇప్పటికే 24 క్యారెట్ల బంగారం రేటు లక్ష రూపాయల మార్క్ దాటింది. అయితే, ఇటీవల పరిస్థితి కొంచెం మారింది. దాదాపు ఐదు రోజులుగా బంగారం ధరలు గణనీయంగా పడిపోతున్నాయి. ఈ క్రమంలో 24 క్యారెట్ల బంగారం రేటు సుమారు రూ. 1,920 మేరకు తగ్గగా, 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 1,760 మేర తగ్గింది.
వివరాలు
బంగారం ధరలు:
ఇక ఇప్పటివరకు స్థిరంగా ఉన్న వెండి ధరలు కూడా గత రెండు రోజులుగా తగ్గుముఖం పట్టాయి. కిలో వెండి ధర సుమారు రూ. 2,100 మేరకు తగ్గింది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రస్తుత బంగారం, వెండి రేట్లు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రేటు రూ. 1,01,540గా, 22 క్యారెట్ల రేటు రూ. 93,090గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,01,390గా, 22 క్యారెట్ల రేటు రూ. 92,940గా కొనసాగుతోంది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడల్లో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,01,390గా, 22 క్యారెట్ల ధర రూ. 92,940గా ఉంది.
వివరాలు
వెండి ధరలు:
దేశవ్యాప్తంగా వెండి ధరలు సుమారు రూ. 2,100 మేరకు తగ్గాయి. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, పూణేలో కిలో వెండి ధర రూ. 1,14,900గా ఉంది. హైదరాబాద్, కేరళ, చెన్నై, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 1,24,900గా నమోదైంది. గమనిక: పై ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి. తాజా బంగారం రేట్లు తెలుసుకోవడానికి 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వొచ్చు.