
Gold Rate: మహిళలకు బాడ్ న్యూస్ .. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులంపై ఎంత పెరిగిందో తెలుసా..?
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం ధరలు కొంతకాలం ఉపశమనం ఇచ్చినట్లు కనిపించినా, ఇప్పుడు మళ్లీ అమాంతంగా పెరిగాయి. ఇటీవల కాలంలో బంగారం ధరలు లక్ష రూపాయల మార్క్‌ను దాటిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత పసిడి ధరల్లో క్రమంగా తగ్గుదల కనిపించింది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడంతో బంగారం ధరలు దాదాపు రూ.5,000 వరకూ తగ్గిపోయింది. కానీ, తాజా పరిణామాల నేపథ్యంలో పసిడి ధరలు మళ్లీ ఒక్కసారిగా పెరగడం వినియోగదారుల్లో ఆందోళనకు దారితీసింది. తాజా ధరల ప్రకారం బంగారం, వెండి రెండింటిలోనూ గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. పదిగ్రాముల బంగారంపై రూ.1,140 మేర పెరిగింది.
వివరాలు
24 క్యారెట్లపై రూ.1,140
జులై 1, 2025 మంగళవారం ఉదయం వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన సమాచారం ప్రకారం: 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,400గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,200గా ఉంది. ఈ పెరుగుదలలో 24 క్యారెట్లపై రూ.1,140, 22 క్యారెట్లపై రూ.1,050 మేర పెరిగాయి. వెండి ధర కిలోకు ఏకంగా రూ.2,300 పెరిగి, ప్రస్తుతం రూ.1,10,000గా ఉంది.
వివరాలు
ప్రముఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి:
హైదరాబాద్: 24 క్యారెట్లు - ₹98,400 22 క్యారెట్లు - ₹90,200 వెండి కిలో - ₹1,20,000 విజయవాడ & విశాఖపట్నం: 24 క్యారెట్లు - ₹98,400 22 క్యారెట్లు - ₹90,200 వెండి కిలో - ₹1,20,000 ఢిల్లీ: 24 క్యారెట్లు - ₹98,550 22 క్యారెట్లు - ₹90,350 వెండి కిలో - ₹1,10,000 ముంబై: 24 క్యారెట్లు - ₹98,400 22 క్యారెట్లు - ₹90,200 వెండి కిలో - ₹1,10,000 చెన్నై: 24 క్యారెట్లు - ₹98,400 22 క్యారెట్లు - ₹90,200 వెండి కిలో - ₹1,20,000 బెంగళూరు: 24 క్యారెట్లు - ₹98,400 22 క్యారెట్లు - ₹90,200 వెండి కిలో - ₹1,10,000