LOADING...
Gold Rate: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.. వారంరోజుల్లో ఎంత తగ్గిందంటే..?
మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.. వారంరోజుల్లో ఎంత తగ్గిందంటే..?

Gold Rate: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.. వారంరోజుల్లో ఎంత తగ్గిందంటే..?

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 27, 2025
10:47 am

ఈ వార్తాకథనం ఏంటి

గత వారం రోజుల పాటు అత్యధిక స్థాయికి చేరిన బంగారం ధరలు ప్రస్తుతం తగ్గుదల బాటలో ఉన్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు క్రమంగా తగ్గడంతోపాటు, అమెరికా-చైనా దేశాల మధ్య ఉన్న టారిఫ్ వివాదంలో రెండు దేశాలు వెనక్కు తగ్గిన నేపథ్యంలో, గోల్డ్ ధరలు క్రమంగా పడిపోతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముందస్తు అంచనాల ప్రకారం, రాబోయే వారం రోజుల్లో బంగారం ధరలు మరింత పడిపోవచ్చని సూచిస్తున్నారు.

వివరాలు 

విలువల్లో తగ్గుదల ఎలా ఉందంటే.. 

శుక్రవారం ఉదయం నాటికి అందిన తాజా సమాచారం ప్రకారం, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.930 మేర తగ్గుదల నమోదు కాగా, 22 క్యారెట్ల బంగారంపై రూ.850 మేర తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఇదే ప్రభావం కనిపించింది.అక్కడ ఔన్స్ బంగారం ధర $40 తగ్గి $3,293 వద్ద ట్రేడవుతోంది. గత వారం మొత్తం గోల్డ్ ధరలలో సుమారు రూ.5,000మేర తగ్గుదల కనిపించింది. ఇదే సమయంలో, వెండి ధర కూడా తగ్గుముఖం పట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి: హైదరాబాద్,విజయవాడ, విశాఖపట్టణం వంటి ప్రధాన నగరాల్లో బంగారం ధర గణనీయంగా తగ్గింది. 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర రూ.89,850గా ఉండగా, 24క్యారెట్ల ధర రూ.98,020కు చేరింది.

వివరాలు 

ఇతర ప్రధాన నగరాల్లో..

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,000 కాగా, 24 క్యారెట్ల ధర రూ.98,170కి పెరిగింది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.89,850గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.98,020 వద్ద కొనసాగుతోంది. వెండి ధరల్లోనూ మార్పు: హైదరాబాద్, విజయవాడ,విశాఖపట్టణం నగరాల్లో వెండి ధర కొద్దిగా తగ్గింది.ఫలితంగా, ఈ నగరాల్లో కిలో వెండి ధర రూ.1,17,900 వద్ద ఉంది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరుల్లో కిలో వెండి ధర రూ.1,07,000గా ఉండగా,చెన్నైలో మాత్రం రూ.1,17,900 వద్ద కొనసాగుతోంది.